Vishnu Mantra: శ్రీ‌మ‌హా విష్ణువును లోక రక్షకుడిగా భావిస్తారు. ఆయనను ఆరాధించడం వల్ల మనిషికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు. ఆ దేవ‌దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు మంత్ర పఠనం అత్యంత‌ సులువైన మార్గం. ముఖ్యంగా గురువారం విష్ణువు మంత్రాలను పఠించడం వల్ల ఆ రోజు మరింత ఫలప్రదంగా సాగుతుంద‌ని విశ్వ‌సిస్తారు. విష్ణు మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. అత్యంత శక్తివంతమైన శ్రీ‌మ‌హా విష్ణు మంత్రాలను తెలుసుకుందాం.


Also Read : గురువారం అర‌టి చెట్టును పూజిస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?


శ్రీ మ‌హా విష్ణువు ప్రత్యేక మంత్రాలు


- ఓం నమో భగవతే వాసుదేవాయ      
- ఓం విష్ణవే నమః                       
- ఓం హుం విష్ణవే నమః              
- శ్రీ కృష్ణ గోవింద హరే మురారే|          
   హే నాథ్ నారాయణ వాసుదేవాయ||
- ఓం నారాయణాయ విద్మహే|          
   వాసుదేవాయ ధీమహి|           
   తన్నో విష్ణు ప్రచోదయాత్||
- ఓం నమో నారాయణ|
  శ్రీ మన్ నారాయణ నారాయణ హరి హరి||


డబ్బు కోసం విష్ణు మంత్రం


ఓం భూరిద భూర్య దేహినో, మ దభ్రం భూర్య భర
భూరి ఘేదీంద్ర దిత్ససి|                                     
ఓం భూరిద త్యసి శ్రుతః పురుత్ర సుర వృత్రహన్|
ఆ నో భజస్వ రాధాసీ|                                          


విష్ణు లక్ష్మీ వినాయక మంత్రం


"దంతాభయే చక్ర దారో దధనం, కరాగ్రగస్వర్ణఘటం త్రినేత్రమ్|
ధృతాబ్జాయ లింగితాంబ్ధిపుత్రాయ లక్ష్మీగణేశం కనకభామిధే||''


విష్ణు పంచరూప మంత్రం


ఓం హ్రీం కార్తవీర్యార్జునో నామ రాజా బహు సహస్త్రవాన్
యస్య స్మరేణ మాత్రేణ హ్రతం నిత్తం చ హైలయతే||''


రోజువారీ విష్ణు పూజ మంత్రం


- ఓం వాసుదేవాయ నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం అనిరుద్ధాయ నమః
- ఓం సంకర్షణాయ నమః
- ఓం నారాయణాయ నమః


Also Read: శివుడు, విష్ణువు వేర్వేరా? పురాణాలు ఏం చెబుతున్నాయి?


విష్ణు మంత్ర ప‌ఠ‌నంతో ప్రయోజనాలు


విష్ణు మంత్రాలను పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఫ‌లితంగా ఇంట్లో ఆర్థిక సమ‌స్య‌లు తొల‌గిపోతాయి. శ్రీ మ‌హా విష్ణువు మంత్రాలను పఠించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం, విష్ణు మంత్రాలను క్రమం తప్పకుండా జపించడం వల్ల జీవితంలో దేనికీ లోటు ఉండదు. పై విష్ణు మంత్రాలలో దేనినైనా కనీసం 108 సార్లు జపించాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.