కొంత మందికి ఉన్నత స్థాయికి చేరిన తర్వాత తాము నడిచి వచ్చిన దారిని మర్చిపోతారు. ఏ స్థాయి నుంచి వచ్చామనే విషయాన్ని గుర్తు పెట్టుకోరు. పైగా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు హాలీవుడ్ లో రాణిస్తున్న టి ప్రియాంకా చోప్రా పరిస్థితి సైతం అలాగే ఉంది. దక్షిణాది సినిమాలో సినీ కెరీర్ మొదలు పెట్టిన ఆమె, బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగు పెట్టుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.


భారతీయ సినిమాల్లో అవి మాత్రమే చూపిస్తారు- ప్రియాంక చోప్రా


తాజాగా ప్రియాంకా చోప్రాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది పాత వీడియో అయినా, అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారతీయ సినిమాలను కించపరుస్తూ ఆమె ఈ వీడియోలో దారుణ వ్యాఖ్యలు చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 2016లో ఎమ్మి అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంకా చోప్రా పాల్గొన్నది. అవార్డుల వేడుక అనంతరం బయకు వచ్చిన ప్రియాంకను భారతీయ సినిమాలను గురించి చెప్పాలని ఓ అంతర్జాతీయ మీడియా రిపోర్టర్ అడుగుతుంది. దీంతో ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చీప్ కామెంట్స్ చేసింది. ఏమాత్రం తడుముకోకుండా “భారతీయ సినిమాల్లో హిప్స్, B**bs తప్ప ఇంకేమీ ఉండవు” అని చెప్పింది. అంటే, కేవలం అంగాంగ ప్రదర్శన చేయడం తప్ప ఇంకేం ఉండదనే రీతిలో ఆమె మాట్లాడింది.   






ప్రియాంక వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం


బాలీవుడ్‌లో నటిగా జీవితాన్ని ప్రారంభించి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా తనకు నటిగా జన్మనిచ్చిన భారతీయ సినిమాలపై చేసిన విమర్శలను నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మాటలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. “భారత చలనచిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని తెలుసు. కానీ, అంతర్జాతీయ వేదికపై  భారతీయ పరిశ్రమ గురించి ఆమె మాట్లాడిన విధానం చాలా బాధపెట్టింది” అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “భారత చలనచిత్ర పరిశ్రమ గురించి అంతర్జాతీయ వేదికపై ఇలా చీప్‌గా మాట్లాడటం దారుణం. ఆమెను ఇండియన్‌ సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్‌ చేయాలి” అని మరో నెటిజన్ తెలిపాడు.


వాస్తవానికి ప్రియాంక భారతీయ సినీ పరిశ్రమ గురించి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో పాతదే అయినా,  ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ 'సిటడెల్‌' విడుదల కావడంతో, ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ ప్రియాంక పేరు ట్రెండింగ్‌ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు 2016 నాటి ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా, తను మాట్లాడిన విధానం చాలా తప్పుగా ఉందని పలువురు సినీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు.


Read Also: ప్రభాస్ ఫ్యాన్స్‌ కు, ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చే యాక్షన్ - 'సలార్' టీజర్ వచ్చేసిందోచ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial