కొన్ని ఆహారాలు, పానీయాలు క్యాన్సర్ కు కారణం కాగలవని ఆంకాలజీ డైటీషియన్లు అంటున్నారు. ప్రాసెస్ చేసిన మంసాహారాలు, ఆల్కహాల్ తీసుకుంటే రకరకాల క్యాన్సర్లకు ఆహ్వానం పలిగినట్లేనట. “షుగర్ డస్ నాట్ ఫీడ్ క్యాన్సర్: ది కంప్లీట్ గైడ్ టు క్యాన్సర్ ప్రివెన్షన్ న్యూట్రిషన్ & లైఫ్‌స్టైల్” అనే పుస్తక రచయిత నికోల్ ఆండ్రూస్ ఆంకాలజీ డైటిషన్ కూడా ఆమె తన లెటేస్ట్ టిక్ టాక్ పోస్ట్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి చేశారు. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


మాంసాహరం


ఆమె తనపోస్ట్ లో ప్రస్తావించిన విషయాలన్నీంటి కూడా నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే 2015 లోనే ప్రాసెస్ చేసిన మాంసాహారం క్యాన్సర్ కారకమేనని ప్రకటించింది. యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్ ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ వారి అధికారక వెబ్సైట్ లో ప్రాసెస్ చేసిన మాంసాహారాలలో హామ్, సాసెజ్, హాట్ డాగ్ లు పెప్పరోని, రోజ్ట్ బీఫ్, టర్కీ వంటి మాంసాహారాలు క్యాన్సర్ కారక మాంసాహారాల్లో ఉన్నాయి. బేకన్, కోల్డ్ కట్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాహారాలతో జీర్ణాశయం, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందట.


ప్రాసెస్ చేసిన మాంసం వల్ల ఎలా క్యాన్సర్ వస్తుందన్న వివరాలను పరిశోధకులు సరిగ్గా వివరించలేదు. కానీ ప్రాసెసింగ్ లో ఉపయోగించే నైట్రేట్లు, చాలా ఎక్కువ వేడిలో వండడం వల్ల ఇవి క్యాన్సర్ కు కారణం అవుతాయని అంచనా వేస్తున్నారు.


మరో కారణం ఆల్కహాల్


సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన దాన్ని బట్టి ఏ రకమైన ఆల్కహాల్ అయినా సరే క్యాన్సర్ ను కలిగించగలదు. ఆల్కహాల్ వినియోగం ఎంత పెరగితే ప్రమాదం అంత ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ ఆహార పదార్థాల్లా శరీరంలో జీర్ణం కాదు. శరీరంలో చేరిన ఆల్కాహాల్ ఎసిటాల్డిహైడ్ అనే రసాయనంగా విచ్చిన్నం అవుతుంది. ఇది శరీరంలోని డిఎన్ఏ మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో హీలింగ్ సమార్రథ్యం క్రమంగా తగ్గిపోతుంది.


ఇవి మాత్రమే కాదు డజన్ల కొద్దీ రకరకాల ఆహారపదార్థాలు క్యాన్సర్ కలిగించగలవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఎనర్జీ డ్రింక్స్, నాన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఫూడ్ డైట్, డైట్ సోడాలు, ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు, డైరీ పదార్థాలు, గ్లూటెన్ వంటి అనేక పదార్థాలు క్యాన్సర్ కలిగించగలవు. ఈ వివరాలన్నీ కూడా దశాబ్ధాల తరబడి చేసిన పరిశోధనల ద్వారా సేకరించిన సమాచారంగా నిపుణులు మరోసారి స్పష్టం చేస్తున్నారు.


వీటితో పాటు హై ఎనర్జీ కలిగిన ఆహారాలు కూడా క్యాన్సర్ ను కలిగించగలవు. చక్కెర ఎక్కువ కలిగిన పదార్థాలు, కొవ్వులు, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాల వినియోగం పెరిగినా కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. స్థూల కాయం వల్ల రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది.


జీవన శైలి


 ఇవి మాత్రమే కాదు పొగతాగడం, పాసివ్ స్మోకింగ్ అంటే పొగతాగే వారి పరిసరాల్లో మెలగడం, తగినంత వ్యాయామం లేని జీవన శైలి వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నివారణే చాలా మేలైనదనే సామెత క్యాన్సర్ విషయంలో చాలా నిజమని గుర్తుంచుకోవాలి. అందుకే వీలైనంత వరకు క్యాన్సర్ కు కారణం కాగల కారకాలకు దూరంగా ఉండడం అవసరం.


Also Read : ప్రపంచ హృదయ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. హార్ట్ హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్ ఇదే