మనం అందరికీ నచ్చాలని లేదు. మన అభిప్రాయాలు, మన భావాలు, మన నిర్ణయాలు ప్రతి ఒక్కరూ మెచ్చేలా ఉండాలని లేదు. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు... తమకు నచ్చలేదని చెబుతారు. ఇలా చెప్పినప్పుడు తమని వారు తిరస్కరిస్తున్నట్టు, తమ భావాలను ఒప్పుకోనట్టు ఎంతోమంది ఫీలవుతారు. మానసికంగా నలిగిపోతారు. చిన్న తిరస్కరణను కూడా తట్టుకోలేని అలాంటివారు ‘రిజెక్షన్ ట్రామా’ (Rejection Trauma) బారిన పడినట్టే ఇదొక మానసిక రుగ్మత. దీన్ని రిజెక్షన్ సెన్సిటివ్ డిస్పోరియా (RSD) అని కూడా పిలుస్తారు. తీవ్రమైన భావోద్వేగ ప్రతిస్పందన ఇది. ఒక వ్యక్తి మానసిక శ్రేయస్సుకు, ఆత్మ గౌరవానికి, సామాజిక జీవనానికి ఇంత ప్రతిస్పందన మంచిది కాదు. అందుకే దీన్ని కూడా ఒక మానసిక రోగంగానే భావించాలి. ఇంతగా తిరస్కరణ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే అది మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.


ఈ రిజెక్షన్ ట్రామా బారిన పడిన వారు... ఎవరైనా తమ చెప్పిన విషయాన్ని ఒప్పుకోకపోతే లేదా విమర్శిస్తే చాలా సున్నితంగా మారిపోతారు. ఎక్కువగా బాధపడి పోతారు. చిన్న చిన్న మాటలకే కుంగిపోతారు. అవమానంగా తీసుకుంటారు. విచారంగా ఉంటారు. ఈ సమస్య ఉన్న వ్యక్తులు ఆకస్మికంగా తీవ్ర భావోద్వేగా మార్పులకు కారణం అవుతారు. కోపం, విచారం, ఆందోళన వంటివి వీరిలో చాలా త్వరగా వస్తాయి. మీరు తమ గురించి తమ చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. తాము ఎవరికీ నచ్చమని భావిస్తూ ఉంటారు. తాము చాలా తక్కువ అనే భావనతో  బాధపడుతూ ఉంటారు.


కొన్ని సందర్భాల్లో తాము విఫలం చెందామని చాలా డిప్రెషన్‌కు గురవుతూ ఉంటారు. వారిని  రిజెక్షన్ అనే భయం వెంటాడుతూ ఉంటుంది. అంటే తమను ఎవరైనా తిరస్కరిస్తారేమో, తాము చెప్పింది వినరేమో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. ఇవి ఈ ఫీలింగ్స్ ఉండడం వల్ల సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడంలో వీరు విఫలం అవుతూ ఉంటారు. ఇతరులతో బహిరంగంగా ఇష్టం లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ పేరుని ఇష్టపడే వారి సంఖ్య తగ్గిపోతుంది.


రిజెక్షన్ ట్రామాను తేలికగా తీసుకోకూడదు. ఇది ఒక వ్యక్తి జీవితం పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒంటరితనం, నిరాశ, ఆందోళన వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇది తమ సొంత పనుల్లో, చదువులో, ఉద్యోగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. వీరికి ఖచ్చితంగా మానసిక నిపుణుల సహాయం అవసరం. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మానసిక వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోండి.


Also read: ఈ దేశాల్లో అమ్మలు అదృష్టవంతులు, ప్రసూతి సెలవులు పుష్కలం


Also read: సూర్యాస్తమయం తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్, ఆ వ్యాధి ఉన్నట్లే



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.