Sundown Syndrome: సూర్యాస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో అధికంగా ఉన్న కాంతి, సూర్యాస్తమయం సమయానికి నారింజ రంగులో మారి అస్తమిస్తుంది. కానీ కొందరిలో సూర్యాస్తమయం జరుగుతున్న కొద్దీ... కొన్ని లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. వారి శారీరక మానసిక స్థితిలో కొన్ని మార్పులు వస్తాయి. సూర్యాస్తమయం అవుతుంటూనే ఇలా భయపడి పోయే వారు కొంతమంది ఉంటారు. వారంతా కూడా సన్ డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న వారే. అంటే సూర్యాస్తమయం అవుతూ ఉంటే వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఇలా సన్ డౌన్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఎక్కువ.
ఈ వ్యాధి బారిన పడినవారు సూర్యాస్తమయం తర్వాత గందరగోళంగా ఆలోచిస్తూ ఉంటారు. వారిలో ఆందోళన పెరుగుతుంది. గాభరా పడుతుంటారు. మతిమరుపు వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. చిత్త వైకల్యం ఉన్నట్టు కనిపిస్తారు. అశాంతిగా, చిరాకుగా ఉంటారు. తీవ్రంగా అలసట పడుతుంటారు.
అల్జీమర్స్, చిత్త వైకల్యం వంటి సమస్యలు సన్ డౌన్ సిండ్రోమ్‌కు సంబంధించిన నాడీ సంబంధిత వ్యాధులుగా చెప్పుకోవాలి. దీని గురించి తెలిసింది చాలా తక్కువే. ఇంకా ఈ సిండ్రోమ్ గురించి ఎన్నో పరిస్థితుల్లో జరుగుతున్నాయి. కొంతమంది నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి సిర్కాడియన్ రిథమ్‌తో ఈ సన్ డౌన్ సిండ్రోమ్ సంబంధం కలిగి ఉండవచ్చు. ఈ సిండ్రోమ్ ఆ వ్యక్తుల జీవన నాణ్యత పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నీడలు అధికంగా చూసినా, కాంతి తగ్గిపోతున్నా వారిలో అనేక రకాల లక్షణాలు బయటపడుతూ ఉంటాయి.
డిమెన్షియా ఉన్నవారికి, అంటే చిత్తవైకల్యం ఉన్నవారికి ఈ సిండ్రోమ్ త్వరగా వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం చిత్తవైకల్యం అనేది ఒక మానసిక రోగం. ఇది వృద్ధాప్యం అవుతున్న కొద్దీ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. డిమెన్షియా అనేది అల్జీమర్స్ వ్యాధిగా కూడా చెప్పుకుంటారు. అలాగే మెదడు స్ట్రోక్ వంటి వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతారు.
సన్‌డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. వారు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన కౌన్సిలింగ్ మందులను మానసిక వైద్య నిపుణులు అందిస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ సిండ్రోమ్ తగ్గే అవకాశం ఉంది.
Also read: బ్లూ బెర్రీ పండ్లను చదువుకునే పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి