Migraine Diet Tips : మైగ్రేన్ అనేది ఒక న్యూరోలాజికల్ సమస్య. ఇది అనేక రోజూవారీ అంశాలతో పాటు వివిధ రకాల ఆహారాలు, పర్యావరణ కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అయితే అరటి, అవకాడో వంటి పోషకాలతో నిండిన పండ్లు కూడా కొన్నిసార్లు మైగ్రేన్​ను ట్రిగర్ చేస్తాయట. ఎందుకంటే రెండింటిలోనూ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఉండే కొన్ని సహజ అంశాలు సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులలో మైగ్రేన్ ట్రిగర్ చేయడం లేదా ఎక్కువ చేయడం చేస్తాయట.

Continues below advertisement

పండిన అరటిలో టైరమైన్ ఎక్కువగా ఉంటుంది. అయితే అవకాడోలో ఉండే కొన్ని ఫినోలిక్ సమ్మేళనాలు మెదడులోని రసాయన సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. అందువల్ల తరచుగా మైగ్రేన్ వచ్చే వారిపై ఈ పండ్లు ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొంచెం జాగ్రత్త, సరైన మోతాదులో తీసుకుంటే.. నొప్పిని పెంచకుండానే పండ్లలోని పోషకాలను పొందవచ్చు. 

అరటి, అవకాడో ప్రయోజనాలు

అరటిపండు పొటాషియం, విటమిన్ B6, మెగ్నీషియం, సహజ చక్కెరలకు మంచి మూలం. ఇది శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తుంది. పొటాషియం రక్తపోటును, శరీరంలో ద్రవ సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అయితే విటమిన్ B6 మెదడు, జీవక్రియకు అవసరం. అరటిలో ఉండే మెగ్నీషియం కండరాలను సడలించడానికి, నరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Continues below advertisement

అరటిపండు జీర్ణం చేసుకోవడం కూడా సులభం. కాబట్టి అనారోగ్యం లేదా అలసట తర్వాత ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడానికి ఇది మంచి ఎంపిక. మరోవైపు అవకాడో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవన్నీ గుండె, మెదడు, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. అవకాడో విటమిన్ E, లుటిన్ వంటి భాగాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి చర్మం, మంటను నియంత్రించడంలో సహాయపడతాయి. దీని ఆరోగ్యకరమైన ఫ్యాట్ ప్రొఫైల్ కొవ్వు-కరిగే విటమిన్లను శరీరం గ్రహించడంలో కూడా సహాయపడుతుంది.

అరటి, అవకాడో మైగ్రేన్‌ను ఎందుకు ట్రిగర్ చేస్తాయంటే?

రెండు పండ్లలోనూ టైరమైన్ అనే సహజ అమైనో ఆమ్లం ఉంటుంది. ఈ సమ్మేళనం శరీరంలో ప్రోటీన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది. టైరమైన్ రక్త కణాల విస్తరణ, న్యూరోట్రాన్స్మిటర్ల విడుదలను ప్రభావితం చేస్తుంది. ఇవి మైగ్రేన్‌తో ముడిపడి ఉన్న ముఖ్యమైన అంశాలు. అరటిపండు ఎంత ఎక్కువ పండితే.. అందులో టైరమైన్ స్థాయి పెరుగుతుంది. బాగా పండిన అవకాడో విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. అవకాడోలో కొద్ది మొత్తంలో హిస్టామిన్, పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులలో మంట, నాడీ వ్యవస్థను మరింత ప్రేరేపిస్తాయి.

మైగ్రేన్‌లో టైరమైన్ పాత్ర

టైరమైన్ కలిగిన ఆహారాలు మైగ్రేన్‌కు కారణమవుతాయని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. PubMedలో ఉన్న పరిశోధన ప్రకారం.. టైరమైన్ సింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా రక్త ప్రవాహం, రక్తపోటును ప్రభావితం చేస్తుంది. ఈ ప్రక్రియ మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

మైగ్రేన్ సమస్య ఉన్నవారు అరటి, అవకాడోను తమ డైట్​లో చేర్చుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా పండిన అరటి, అవకాడోలను తినవద్దు. ఎందుకంటే పండటం వల్ల టైరమైన్ పెరుగుతుంది. ఎక్కువ మోతాదులో కాకుండా.. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఇబ్బందులు ఉండవు. మీరు ఏమి తింటే తలనొప్పి వస్తుందో తెలుసుకోవడానికి ఫుడ్ డైరీని సెట్ చేసుకోండి. మిమ్మల్ని ఏ ఫుడ్స్ ట్రిగర్ చేస్తున్నాయో వాటికి దూరంగా ఉండవచ్చు. వైద్యుల సహాయంతో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చనేదానిపై క్లారిటీ తెచ్చుకుంటే మరీ మంచిది.