భారతీయ శిక్షా బోర్డ్ (BSB) విద్యారంగంలో భారత సంస్కృతి, ఆధునిక విజ్ఞాన శాస్త్రం మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల అలీగఢ్‌లో జరిగిన డివిజనల్ స్థాయి సింపోజియంలో BSB ఛైర్మన్ డాక్టర్ N.P. సింగ్ మాట్లాడుతూ.. పిల్లలను కేవలం భౌతికవాద విద్యకు మాత్రమే పరిమితం చేయకూడదని నొక్కి చెప్పారు. అందుకు బదులుగా కంప్యూటర్ సైన్స్ వంటి ఆధునిక సబ్జెక్ట్‌లతో పాటు వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తుల నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా బోధించాలన్నారు.
సాంస్కృతిక మూలాలతో విద్యార్థులు అనుసంధానం
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఎన్.పి సింగ్ మాట్లాడుతూ.. “ఈ కొత్త నమూనా సంస్కృతి, నీతివంతమైన, శాస్త్రీయంగా అవగాహన ఉన్న తరాన్ని సృష్టించడంపై ఫోకస్ చేసింది. ప్రపంచ పోటీకి వారిని సిద్ధం చేస్తూనే విద్యార్థులను వారి సాంస్కృతిక మూలాలతో అనుసంధానం చేయడమే లక్ష్యమని” చెప్పారు.
ఆధునిక పాశ్చాత్య విద్య ప్రభావంతో విద్యార్థులు నైతిక పతనాన్ని ఎదుర్కొంటున్నారు. భారత సంస్కృతి, విలువలు విద్యా వ్యవస్థలో క్షీణిస్తున్నాయని ఈ సందర్భంగా ఎన్పీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్య వక్తగా ఆయన డివిజన్ అంతటా ఉన్న 300 మందికి పైగా పాఠశాల నిర్వాహకులు, ప్రిన్సిపాల్స్, ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు.
విలువలతో కూడిన విద్య
భారతీయ విద్యా బోర్డు ప్రధాన లక్ష్యం అత్యుత్తమ, విలువలతో కూడిన పిల్లలను అభివృద్ధి చేయడమేనని ఎన్పీ సింగ్ స్పష్టం చేశారు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి భారత సంస్కృతి, ఆధ్యాత్మిక బోధనలను ఆధునిక కంప్యూటర్ సైన్స్, ప్రకృతి ఆధారిత అభ్యాసంతో అనుసంధానించడం ద్వారా నీతితో మెలిగే పౌరులను తయారు చేయడానికి బోర్డు ప్రయత్నిస్తుంది. భారతదేశాన్ని బలమైన, “విశ్వగురు”గా తీర్చిదిద్దడానికి తమ పాఠశాలలను భారతీయ విద్యా బోర్డుతో అనుసంధానం చేయాలని అందరినీ ఆయన కోరారు.
పురాతన వేద సంస్కృతికి విద్యార్థులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ సంగీత సింగ్ మాట్లాడుతూ.. పిల్లలకు విలువలను అందించడంలో తల్లిదండ్రులు, ఆదర్శ ఉపాధ్యాయులు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అన్నారు. పెద్ద పెద్ద భవనాలు ఉన్న పాఠశాలలకు మాత్రమే ఆకర్షితులు కాకుండా, విద్యార్థులు పురాతన వేద సంస్కృతికి తిరిగి రావాలి అన్నారు. భారతీయ విద్యా బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆమె కోరారు.
(నిరాకరణ: ఇది స్పాన్సర్ చేసిన కథనం. ABP నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు/లేదా ABP దేశం ఈ కథనంలోని విషయాలను మరియు/లేదా ఇక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఏ విధంగానూ ఆమోదించదు/సబ్‌స్క్రైబ్ చేయదు.)