వెన్ను నొప్పి లేదా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. కూర్చుంటే నడుము నొప్పి అని చెప్పే వారు ఎంతోమంది. 2017తో పోలిస్తే 2020లో నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగినట్టు కొత్త అధ్యయనం బయట పెట్టింది. లాన్సెట్ రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 2050 నాటికి వెన్ను నొప్పితో బాధపడే వారి సంఖ్య 80 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే 2020తో పోలిస్తే 2050 నాటికి 36% పెరుగుతుందని అంచనా. 2020లో 60 కోట్ల మంది ఇలా నడుము నొప్పి బారిన పడినట్టు అధ్యయనం చెబుతోంది. 


నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య ఆసియాలోనే ఎక్కువగా ఉందని ఆ తర్వాత ఆఫ్రికాలో అధిక శాతం నమోదు అవుతున్నాయని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. నడుము నొప్పిని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ ప్రపంచంలో ఎన్నో అనారోగ్యాలకు నడుమునొప్పి ప్రధాన కారణం. ఈ నడుము నొప్పి వల్ల మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక  అనారోగ్యాలు వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. అపారమైన ఒత్తిడి వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. నడుము నొప్పి వస్తున్నప్పుడు దాని తేలిగ్గా తీసుకోకూడదు. అవి అది ఇతర ప్రధాన అవయవాలకు హాని చేస్తుంది.


ధూమపానం, అధిక బరువు కారణంగా నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతుంది. మగవారితో పోలిస్తే ఆడవారిలోనే నడుము నొప్పి కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ పని చేస్తే నడుమునొప్పి వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. వృద్ధుల్లో ఎక్కువగా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. 


నడుమునొప్పి సాధారణంగా వచ్చేదే అయితే ప్రమాదం లేదు. కానీ కొన్ని రకాల కారణాల వల్ల నడుము నొప్పి వస్తుంది. అలాంటప్పుడు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. నడమునొప్పితో పాటూ జ్వరం వస్తే తేలికగా తీసుకోకూడదు. అలాగే ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కాళ్లు బలహీనంగా మారడం, కాళ్లు తిమ్మిర్లు, మూత్రం, మలవిసర్జనలపై పట్టు లేకపోవడం వంటివి నడుము నొప్పితో పాటూ వస్తే జాగ్రత్త పడాలి. నడుము నొప్పితో పాటూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చికిత్స తప్పకుండా తీసుకోవాలి.  కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. గర్భాశయంలో సమస్యలు ఉన్నా నొప్పి రావచ్చు.



Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతున్నట్టే లెక్క



Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.