Home Workout for Belly Fat : పొట్ట తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మీ లైఫ్​స్టైల్​లో కొన్ని వ్యాయామాలు చేర్చుకోవాలి. అయితే వీటి కోసం జిమ్​కి వెళ్లాలా.. అస్సలు కుదరదు అనుకుంటున్నారా? వీటిని ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఈ వ్యాయామాలు పొట్టను తగ్గించడంతో పాటు పూర్తి కండరాలకు బలం చేకూర్చుతాయి. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటి? వాటివల్ల బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది? వాటితో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ప్లాంక్

శరీరంలోని బెల్లీ ఫ్యాట్​ను కరిగించడంలో హెల్ప్ చేసే వ్యాయామాల్లో ప్లాంక్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా పూర్తి కండరాలకు బలం చేకూర్చుతుంది. దీనిని 30 సెకన్లతో మొదలు పెట్టి.. రోజులు పెరిగే కొద్ది సమయాన్ని పెంచుకోవచ్చు. 

కార్డియో 

వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్ చేయడం, డెడ్ లిఫ్టింగ్, జంపింగ్ జాక్స్ వంటి కార్డియో రెగ్యులర్​గా చేయాలి. ఇవి పూర్తి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కార్డియో చాలా మేలు చేస్తుంది. మెటబాలీజంను పెంచుతుంది. దీనివల్ల మీరు ఏమి చేయకుండా కూర్చొన్నప్పుడు కూడా మీ శరీరంలో కొవ్వు బర్న్ అవుతూ ఉంటుంది. 

లెగ్ రైజ్​

లెగ్ రైజ్ చేయడం వల్ల మీ పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వు తగ్గడంతో పాటు .. కాళ్ల కండరాలకు కూడా మేలు జరుగుతుంది. ఇది కూడా శరీరానికి మంచి షేప్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. 

సిట్ అప్స్

కోర్ ఎక్సర్​సైజ్​లతో పాటు సిట్ అప్స్ చేయడం వల్ల బొడ్డుపై ప్రెజర్ పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా సిట్ అప్స్ చేయడం వల్ల కోర్ కండరాలను బలోపేతం చేసి.. శరీరానికి మంచి షేప్ ఇస్తుంది. 

మౌంటైన్ క్లైంబ్స్

మీరు బెల్లీ ఫ్యాట్​ తగ్గించుకోవాలనుకున్నప్పుడు మౌంటైన్ క్లైంబ్స్ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు చూడొచ్చు. దీనివల్ల పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు. 

సైకిల్ క్రంచెస్

సైకిల్ క్రంచెస్ కూడా పొట్టపై ఎక్కువ ప్రెజర్ పెడతాయి. దీనివల్ల అక్కడ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. రెగ్యులర్​గా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు చూడొచ్చు. అంతేకాకుండా ఇది కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది. మీ భంగిమను కూడా మార్చుతుంది. 

ఇవే కాకుండా ఫుడ్ విషయంలో కూడా మార్పులు చేసుకోవాలి. అన్​హెల్తీ ఫుడ్​కి దూరంగా ఉండాలి. మెరుగైన నిద్ర కూడా పొట్ట దగ్గర ఉండే కొవ్వును దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆరోగ్య సమస్యల వల్ల పొట్ట వస్తుంది అనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.