పురుషులకు ఒకటే అంగం ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, ఉజ్జెకిస్తాన్‌లోని ఓ బాలుడు ఏకంగా రెండు పురుషాంగాలతో పుట్టాడు. పైగా, అవి రెండు సాధారణ పురుషాంగాల తరహాలోనే పనిచేస్తుండటంతో వైద్యులు కొన్నాళ్లు అలాగే వదిలేశారు. ఆ బాలుడికి ఇప్పుడు ఏడేళ్లు. మరి, అతడి పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు అతడి సమస్యను ఎలా పరిష్కరించారు?


యూరాలజీ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెండేసి పురుషాగాలతో పిల్లలు పుట్టడమనేది చాలా అరుదైన కేసు. గత 400 ఏళ్లలో ఇప్పటివరకు కేవలం 200 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో బిడ్డ పుట్టగానే సర్జరీ ద్వారా సరిచేసేవారు. కొన్ని కేసుల్లో మాత్రం సర్జరీలు విఫలమయ్యాయి. అయితే, ఉజ్బెకిస్తాన్‌కు బాలుడికి మాత్రం వైద్యులు వెంటనే సర్జరీ చేయలేదు. దీంతో ఆ బాలుడు ఏడేళ్లుగా రెండు పురుషాంగాలతోనే జీవించాడు. 


ఏడేళ్లుగా సర్జరీ ఎందుకు చేయలేదు?: రెండు పురుషాంగాలతో పుట్టిన ఆ బాలుడికి మల ద్వారం లేకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో దానికి మాత్రమే సర్జరీ చేసి రెండు పురుషాలను మాత్రం అలాగే వదిలేశాడు. అవి రెండు సక్రమంగానే పనిచేస్తుండటంతో వాటిని తొలగించడం లేదు. పైగా, వాటిలో ఏ ఒక్క పురుషాంగం తీసినా బాలుడి ప్రాణాలకే ప్రమాదకరమని భావించారు. 


బాలుడికి రెండు మూత్ర నాళాలు ఉండటం వల్ల రెండు పురుషాంగాల నుంచి మూత్రం పోయగలిగేవాడు. బాలుడికి రెండు అంగస్తంభన నాళాలు ఉన్నాయి. అయితే, అతడికి అంగస్తంభన కలుగుతుందా లేదా అనేది వైద్యులు రిపోర్టులో పేర్కోలేదు. మూత్ర ద్వారం లేకుండా పుట్టడాన్ని ‘అట్రేసియా’(atresia) అంటారని, 1500 పిల్లల్లో ఒకరిలో మాత్రం ఈ సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు.


‘హెల్త్‌లైన్’లో పేర్కొన్న వివరాల ప్రకారం రెండు పురుషాంగాలతో పుట్టే సమస్యను డిఫాలియా (diphallia) అని అంటారు. దీనివల్ల వృషణాలు, జీర్ణ వ్యవస్థ, మూత్ర నాళాల్లో కూడా సమస్యలు ఏర్పడుతాయి. ఈ అరుదైన సమస్య పరిష్కారం కోసం సవాలుతో కూడిన ప్రక్రియ చేపట్టామని ఆ బాలుడికి సర్జరీ అందించిన వైద్యులు తెలిపారు. రెండు పురుషాంగాల్లో ఒకదాన్ని తొలగించామన్నారు. 


సర్జరీలో భాగంగా బాలుడి ఎడమ వైపు పురుషాంగాన్ని చాలా జాగ్రత్తగా తొలగించామని అతడి మూత్ర వ్యవస్థను కుడి వైపు అంగానికి అనుసంధానించామని తెలిపారు. 21 రోజుల వరకు హాస్పిటల్‌లోనే కాథెటర్ ద్వారా అతడికి మూత్ర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత బాలుడు పూర్తిగా తేరుకున్నాడు. సాధారణ పిల్లల్లాగానే మూత్రం పోయగలుగుతున్నాడు. 


Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు


గతేడాది ఇరాక్‌లో మరో బాలుడు ఏకంగా మూడు పురుషాంగాలతో జన్మించాడు. అయితే, వాటిలో ఏ పురుషాంగం సక్రమంగా పనిచేయలేదు. కేవలం ఒకదానికి మాత్రమే గ్రంథి (హెడ్) ఉంది. అయితే, పుట్టిన వెంటనే ఈ సమస్య బయటపడలేదు. మూడు నెలల తర్వాత ఆ పసివాడి తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితిని తెలుసుకుని వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్యులు సర్జరీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు. 


Also Read: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?