Bladder Cancer Precautions : మూత్రాశయ క్యాన్సర్​ను అనేక కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీనిని అభివృద్ధి చేసి ప్రాణాలను హరిస్తాయి. అందుకే ఈ క్యాన్సర్​ను ప్రాణాంతక వ్యాధిగా చెప్తారు. క్యాన్సర్​ అనేది శరీరంలోని ఏ అవయవాలనైనా ప్రభావితం చేయగలదు. అలాగే మూత్రాశయాన్ని కూడా క్యాన్సర్ కారకాలు ప్రభావితం చేస్తాయి. అయితే బ్లాడర్ క్యాన్సర్​ను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


స్మోకింగ్​..


ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అది తెలిసిన విషయమే. అయితే అందరూ గొంతు క్యాన్సర్ వస్తుందనుకుంటారు. కానీ ఇది మూత్రాశయ క్యాన్సర్​కు కూడా కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. పొగాకులోని రసాయనాలు కాలక్రమేణా మూత్రాశయ పొరను దెబ్బతీస్తాయి. 


కెమికల్ ఎక్స్​పోజర్


రబ్బర్లు, తోలు, కలర్స్, పెయింట్ల తయారీలో వినియోగించే కొన్ని కెమికల్స్ మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఆ పరిశ్రమల్లో పనిచేసేవారిలో ఈ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. 


దీర్ఘకాలిక అంటువ్యాధులు


మూత్రమార్గము దగ్గర వచ్చే అంటువ్యాధులు ఎక్కువకాలం ఉంటే అది మూత్రాశయ క్యాన్సర్​కు దారి తీస్తుంది. కొందరికి యూరిన్ ఇన్​ఫెక్షన్ తరచూ వస్తుంటుంది. అలాంటివారు దానిని అశ్రద్ధ చేస్తే అది క్యాన్సర్​కు దారితీస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లు కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 


మగవారికే ఎక్కువ..


వయసు పెరిగిన వారిలో.. ముఖ్యంగా 55 ఏళ్లు పైబడిన వారిలో మూత్రాశయ క్యాన్సర్​ సర్వసాధారణంగా వస్తుంది. అయితే ఆడవారికంటే మగవారినే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. 


జీన్స్..


ఫ్యామిలీలో మూత్రశయ క్యాన్సర్​ ఎవరికైనా ఉంటే.. అది వ్యాధిని అభివృద్ధిని చేసే ఛాన్స్ ఉంది. జన్యుపరంగా ఇది రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. 


లక్షణాలు ఇవే


మూత్రాశయ క్యాన్సర్​ వచ్చినవారిలో మూత్రం రంగులో మార్పు ఉంటుంది. మూత్రం ఎరుపు లేదా కోలా రంగులో కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది కనిపించదు. రిపోర్ట్స్​లో మాత్రమే వస్తుంది. అలాగే మూత్రవిసర్జన తరచుగా చేస్తారు. యూరినేషన్ సమయంలో పెయిన్ తీవ్రంగా ఉంటుంది. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుంది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


మూత్రాశయ క్యాన్సర్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేసి.. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వాటిలో మొదటిగా చేయాల్సింది స్మోకింగ్ మానేయడం. క్యాన్సర్​ కారకాల్లో ప్రధానమైన కారకం ఇదే కాబట్టి దీనికి వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్​పోజర్​గా కూడా ఉండకూడదు. 


శరీరానికి నీటిని పుష్కలంగా అందిస్తే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. మూత్రాశయంలోని హానికరమైన కెమికల్స్​ను నీరు బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ కారకాలు మూత్రాశయంలో పేరుకునే అవకాశం ఉండదు. కెమికల్స్ రహితంగా ఉండడం కూడా పలు క్యాన్సర్లను, ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అలాంటి ప్రాంతాల్లో పని చేయడం లేదా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్​లు వేసుకోవడం మంచిది. 


రోటీన్ కేర్..


పండ్లు, కూరగాయలను రెగ్యూలర్ డైట్​లో తీసుకోవాలి. ఇవి పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అలాగే సమతుల్య ఆహారం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి. రెగ్యూలర్​గా మూత్ర పరీక్షలు, మెడికల్ చెకప్​లు చేయించుకోవడం మంచిది. 



ఇవికాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లను ఫాలో అవ్వడం వల్ల ఏ క్యాన్సర్​కు అయినా దూరంగా ఉండొచ్చు. రెగ్యూలర్​గా స్క్రీనింగ్​లు చేయిస్తే త్వరగా వాటిని గుర్తించి.. మెరుగైన చికిత్సతో బయటపడొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు ఈ క్యాన్సర్ పట్ల మరింత అవగాహన కలిగి ఉండాలంటున్నారు. 


Also Read : గోళ్లలో ఈ మార్పులుంటే జాగ్రత్త.. గోరు రంగును బట్టి మీకు క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయొచ్చంటున్న న్యూ స్టడీ