సాల దినుసుల్లో రారాజు నల్ల మిరియాలు. చిట్టి చిట్టి మిరియాల వల్ల గట్టి లాభాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది మన శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి. శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో చేసిన డికాషన్ చేసుకుని తాగడం వల్ల జలుబు, ఇతర వ్యాధులని నయం చేయడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ కె, ఇ, ఏ, థయామిన్, విటమిన్ బి6, మాంగనీస్, ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, క్రోమియం వంటి పోషకాలు ఉన్నాయి. గాయాలని నయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


రోగనిరోధక వ్యవస్థ ఇస్తుంది


వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండటానికి శరీరంలో బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీనిలోని పోషకాలు తెల్ల రక్తకణాలని పెంచుతాయి. దీని వల్ల బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.


జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది


కడుపులోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల చేస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసేందుకు సహకరిస్తుంది. ఇవి ప్రోటీన్లని విచ్చిన్నం చేస్తాయి. కడుపులో గ్యాస్ ఏర్పడకుండ అడ్డుకుంటుంది.


యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం


ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్స్, వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఆల్కలాయిడ్ పైపెరిన్ మూలకాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే విష పదార్థాలని తొలగించేందుకు పని చేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.


నల్ల మిరియాల వల్ల ప్రయోజనాలు


☀ నల్లమిరియాలతో తో పాటు అల్లం తేనె తీసుకుంటే శీతాకాలంలో దగ్గు, జలుబు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.


☀ ఇందులోని మాంగనీస్, ఇతర విటమిన్లు రక్తపోటుని అదుపులో ఉంచుతాయి.


☀ మిరియాలతో రసం చేసుకుని తీసుకుంటే చాలా మంచిది.


☀ ఇది కాకుండా సలాడ్ పైన ఉప్పు, పెప్పర్ పొడి వేసుకుని తినొచ్చు.


☀ మిరియాలు, అల్లం, గిలోయ్ కలిపి కషాయంగా తయారు చేసుకుని తాగొచ్చు.


☀ పాలలో కాస్త మిరియాల పొడి, పసుపు వేసుకుని తాగితే చాలా మంచిది. ఈ మిశ్రమం కొన్ని రకాల క్యాన్సర్లని నిరోధిస్తుంది. అయితే అధికంగా తాగితే శరీరం వాతానికి గురవుతుంది.


☀ శరీరంలో కొవ్వుని ఇది విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉండదు. ఫలితంగా బరువు తగ్గుతారు.


☀ మొటిమలకు మిరియాలు గొప్ప ఔషధంగా పని చేస్తాయి. మిరియాల పొడిని మొటిమలపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం మీద మృత కణాలని కూడా తొలగిస్తుంది.


☀ కీళ్ల నొప్పులను తగ్గించే గుణం ఇందులో ఉంది. కీళ్ళు, వెన్నెముక నొప్పులతో ఉన్న వాళ్ళు మిరియాల టీ తాగితే మంచిది.


☀ మధుమేహులు కూడా వీటిని తీసుకుంటే మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: రోజుకి 9000 అడుగులు వేయడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుందట