డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందా, ఒంట్లో ఇల్లు కట్టుకుని కూర్చుంటుంది. ఏం తినాలన్న అందులో చక్కెర ఉందా, కేలరీలెంత అని ఆలోచించుకుని తినాలి. అందుకే డయాబెటిస్ రాకుండానే జాగ్రత్తపడమంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మధుమేహులు కాకరకాయను తినవచ్చు. ఎంత తిన్నా కాకర కాయ మేలే చేస్తుంది. ఎన్నో వ్యాధుల నుంచి నయం చేయడంలో కూడా కాకరకాయ ముందుంటుంది. వారి కోసమే ఈ కాకరకాయ పొడి రెసిపీ. దీన్ని ఒకసారి చేసుకుంటే నెల రోజుల పాటూ వాడుకోవచ్చు. భోజనం చేసే ముందు రెండు ముద్దలు ఈ కాకరకాయ పొడితో తింటే ఎంతో ఆరోగ్యం.
కావాల్సిన పదార్థాలుకాకరకాయలు - అయిదు (మీడియం సైజువి)మినపప్పు - రెండు స్పూనులుశెనగ పప్పు - నాలుగు స్పూనులుధనియాలు - మూడు స్పూనులుఎండు మిర్చి - ఆరు (స్పైసీగా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు)వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిదిచింతపండు - చిన్న ఉండనూనె - మూడు స్పూనులుఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా...1. కాకర కాయల్ని శుభ్రం చేసుకుని సన్నగా,గుండ్రంగా చక్రాల్లా కోసుకోవాలి. 2. ఇప్పుడు కళాయిలో నూనె వేయాలి. నూనె వేడెక్కాక కాకర కాయ ముక్కల్ని వేసి వేయించాలి. 3. బాగా వేయిస్తే ముక్కలు బ్రౌను రంగులోకి మారి కాస్త క్రిస్పీగా అవుతాయి. 4. ఇప్పుడు వాటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. 5. మరో కళాయిలో మినప్పప్పు, శెనగ పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించాలి. 6. మిక్సీ గిన్నెలో వేయించిన మసాలాలు, వెల్లుల్లి రెబ్బలు, కాకరకాయ ముక్కలు వేసి, చిన్న చింతపండు, ఉప్పు వేసి పొడిలా చేయాలి. 7. అంతే కాకర కాయ పొడి సిద్ధమైనట్టే. గాలి చొరబడని డబ్బాలో వేస్తే నెల రోజుల పాటూ పాడవ్వకుండా ఉంటుంది. రోజూ రెండు ముద్దలు కాకరకాయ పొడితో తింటే ఎంతో ఆరోగ్యం.
కాకరకాయలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంవటాయి. వీటితో పాటూ శరీరానికి అత్యవసరమైన ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, మాంగనీస్ కూడా లభిస్తాయి. అందుకే కాకరకాయను తినమని వైద్యులు ప్రత్యేకంగా చెబుతారు. ఎన్నో రోగాలకు కాకరకాయ అడ్డుకట్ట వేయగలదు. డయాబెటిస్ వారికీ చాలా మంచిది. జలుబు, దగ్గు, శ్వాససమస్యలు, ఆస్తమా వంటి వాటికి కూడా కాకరకాయ బాగా పనిచేస్తుంది.
Also read: వెల్లుల్లి కారంతో రోజుకో ముద్ద తిన్నా చాలు, ఎన్ని లాభాలో
Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Also read: వంకాయ కూర తింటే అది బాగా పని చేస్తుందట, మీ పిల్లలకు తిరిగే ఉండదు
Also read: