మనలో చాలా మందికి గోళ్ళు కోరుక్కునే అలవాటు ఉంటుంది. టెన్షన్ గా ఉన్న సమయంలో ఆ పని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొందరితే ఏమి తోచకపోయిన గోళ్ళు కోరుక్కుంటూ కూర్చుంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఇలా చెయ్యడం వల్ల లేనిపోనీ కొత్త సమస్యలు తెచ్చుకుని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు టెక్సాస్ ఏ అండ్ యం యూనివర్సిటీ హెల్త్ సైన్స్ నిపుణులు. గోళ్ళు కొరకడం వల్ల వచ్చే నష్టాలను వాళ్ళు వివరిస్తున్నారు. 


గోళ్లలో సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి. మీరు చేతులని తరచూ శుభ్రం చేసుకున్నపటికీ గోళ్ళ కింద ఉన్న మట్టి, క్రిములు మాత్రం అలాగే ఉంటాయి. మనం వాటిని నోట్లో పెట్టుకుని కొరికినప్పుడు అవి మన నోటి ద్వారా కడుపులోకి వెళ్తాయి. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చేతులు కడుక్కునే సమయంలో గోళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి శుభ్రం చేసుకోవాలి. 


ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువ


తరచుగా గోళ్ళని కొరకడం వల్ల గోరుకి పరోనిచియా అనే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల గోరు చుట్టూ వాపు, ఎర్రగా మారడం చిన్న చిన్న బొబ్బలు రావడం జరుగుతుంది. గోరు చుట్టూ ప్రదేశం చీము పట్టి ఇబ్బంది పెడుతుంది. 


మీ దంతాలకు ఇబ్బందే 


గోళ్ళని కొరకడం వల్ల దంతాలకి ఇబ్బందే. తరచూ గోళ్ళు గట్టిగా కొరకడం వల్ల దంతాలు కూడా విరిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు పళ్ల మీద ఉండే ఎనామిల్ పోతుంది. గోళ్ళలో ఉండే క్రిములు మీ చిగుళ్ళకి వ్యాపించి వాటిని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే గోళ్ళల్లో ఉండే బ్యాక్టీరియా కారణంగా అది నోట్లోకి చేరి నోరు దుర్వాసన వస్తుంది. 


తరచూ గోళ్ళని కొరకడం వల్ల అలవాటులో కొంచెం ఎక్కువ లోపలికి కొరికేసుకుంటారు. అలా చెయ్యడం వల్ల గోరు పక్కన ఉండే చర్మం దెబ్బతింటుంది. గోరు బయటికి లేకపోవడం వల్ల చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతారు. వాటి వల్ల ఇన్ఫెక్షన్ వాపు వచ్చి ఒక్కోసారి శాస్త్ర చికిత్స చేసి గోళ్ళని తొలగించాల్సి వస్తుంది.


విషపూరితం 


చాలామంది గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటారు. ఆ సమయంలో వాటిని కొరకడం వల్ల అదంతా కడుపులోకి వెళ్తుంది. అందులో విషపూరిత రసాయనాలు ఉంటాయి. అవి కడుపులోకి చేరడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీకు గోర్లు కోరికే అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.  


Also Read: మెరిసే చర్మం, ఎర్రటి పెదవులు కావాలనుకుంటున్నారా? ఈ పదార్థాన్ని మీ డైట్లో భాగం చేసుకోవాల్సిందే


Also Read: పరగడుపున అల్లం రసం తీసుకుంటే బోలెడు లాభాలు ఉన్నాయండోయ్






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.