పొద్దున తొమ్మిది గంటలకే మొహం బయట పెడితే ఎండకి మాడిపోతుంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వేడి గాలులతో బయటకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. చల్లటి గాలులు ఆరోగ్యానికి ఎంత హానికరమో వేడి గాలులు అదే విధంగా అనారోగ్యానికి దారితీస్తాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల వల్ల చెమటలు ఎక్కువగా పడతాయి. కోర్ శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభవమవుతుంది. దీర్ఘకాలిక వేడి గాలులు వల్ల మూత్రపిండాల వ్యాధులు, అవి వైఫల్యం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతున్న వారిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది.


మూత్రపిండాలు ఎలా ప్రభావితమవుతాయి?


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మనిషి విశ్రాంతి కోరు ఉష్ణోగ్రత 36.5-37.5 డిగ్రీల సెల్సియస్ మధ్య హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. వేడి, ఒత్తిడి ఎక్కువగా ఉండే కొద్ది శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. ఉష్ణ లాభం, ఉష్ణ నష్టం మధ్య సమతుల్యతను కొనసాగించడానికి థర్మోగ్రూలేషన్ జరుగుతుంది. ఇందులో మూత్రపిండాలు ప్రధాన అవయవం. శరీరంలోని రక్తపోటు, నీరు, ఎలక్ట్రోలైట్లను నియంత్రిస్తుంది. వేడి ఒత్తిడి మూత్రపిండాలపై అదనపు భారం వేస్తుంది. దాని వల్ల అవయవాన్ని దెబ్బతీస్తుంది. పదే పదే ఒత్తిడికి గురికావడం వల్ల తీవ్రమైన మూత్రపిండ రుగ్మతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ప్రాణాపాయం కలిగిస్తుంది.


కిడ్నీలపై ఎక్కువ కాలం ఒత్తిడి కొనసాగితే మూత్రపిండాలకు గాయాలు కావడం, యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ పరిమితికి మించి వేడి శరీరానికి తగిలితే కిడ్నీలకు గాయాలు అవుతాయి. ఇది వాటి పనితీరుని దెబ్బతీస్తుంది. వీటికి తోడు ఇతర పర్యావరణ కారణాల వల్ల మూత్రపిండాల వ్యాధులు మరింత ఎక్కువ అవుతాయి.


శరీర అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే బాగా నీరు తాగాలి. పీక అవర్స్ లో సూర్యరశ్మికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాగా హైడ్రేట్ గా ఉంటూ వేడి గాలులకు ప్రత్యక్షంగా తగలకుండా ఉండాలి. మారుతున్న ఉష్ణోగ్రతలని కిడ్నీలు తట్టుకోవడం కష్టం. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వేడి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరమని సూచిస్తుంది.


మూత్రపిండాలను రక్షించే మార్గాలు


⦿ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి


⦿సరైన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి


⦿ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటమే లక్ష్యంగా పెట్టుకోవాలి


⦿కంటి నిండా నిద్రపోవాలి  


⦿మద్యం తీసుకోవడం పరిమితం చేయాలి, వీలైతే పూర్తిగా నివారించడం మంచిది


⦿ఒత్తిడిని తగ్గించుకుంటే సగం అనారోగ్య సమస్యలు తీరిపోతాయి


⦿మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులని తగ్గించుకోవాలి


⦿రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read; నాలుక మండిపోతోందా? అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్టే