ఏప్రిల్ 16 రాశిఫలాలు


మేష రాశి


ఈ రాశి వ్యాపారులకు  ఈ రోజు లాభాలొస్తాయి. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. వివాహితుల బంధం బలంగా ఉంటుంది. కుటుంబంలో శుభాకర్యాలు నిర్వర్తించేందుకు ప్రణాళికలు వేస్తారు. స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. మధ్యాహ్నం తర్వాత చేసే ప్రతి పనిలో జాగ్రత్త అవసరం. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు. సహనంగా వ్యవహరించాలి..తొందరగా అలసిపోతారు.


వృషభ రాశి


ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. బంధువులు, స్నేహితులతో వివాదాలు ఉండొచ్చు.ఈ రోజు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా కొత్త చికిత్స ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఆందోళన, ఒత్తిడి దూరమవుతాయి. జీవిత భాగస్వామితో మాధుర్యం పెరుగుతుంది.


మిథున రాశి


ఈరోజు మతపరమైన పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాన్ని పొందుతారు. జీవితంలో ఆనందం పెరుగుతుంది అదే సమయంలో ఏదో చిన్న బాధ మీ మనసుని తొలిచేస్తుంటుంది. ప్రతికూల ఆలోచనలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆరోగ్య పరంగా సమయం మంచిది. పని ప్రదేశంలో నిర్లక్ష్యానికి దూరంగా ఉండండి.


Also Read: సింహాచలంలో చందనోత్సవం ఎలా జరుగుతుందో తెలుసా!


కర్కాటక రాశి


ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మనసులో ఉన్న ఏదో సందిగ్ధతకు తెరపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మీరహస్య శత్రువులు మీకు హానిచేయలేరు. ఈ రోజు ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


సింహ రాశి


ఈ రాశి వ్యాపారులకు అనుకూలమైన రోజు. గృహ జీవితంలో సంక్లిష్టమైన ప్రశ్నలు పరిష్కారమవుతాయి. శాశ్వత ఆస్తికి సంబంధించిన వివాదంలో విజయం మీవైపు వస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ సంబంధాలు కొనసాగుతాయి. శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందుతారు. సామాజిక రంగంలో వైఫల్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ధన నష్టం కలిగే అవకాశం ఉంది.


కన్యా రాశి


ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. స్థిరాస్తుల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలి. సానుకూల శక్తి మీలో ఉంటుంది..ఈ కారణంగా మీ లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ప్రేమికులు పెళ్లిదిశగా అడుగు ముందుకేస్తే మంచి జరుగుతుంది.


తులా రాశి


ఈ రోజు ఈ రాశివారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వీరికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టమైన పనులు పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న పాత వివాదాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలో సంతృప్తి ఉంటుంది. సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో కూడా లాభపడతారు.


వృశ్చిక రాశి


మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు. ఆదాయం పెరగడంతో కొన్ని చికాకులు దూరమవుతాయి. మంచి దుస్తులు, మంచి భోజనంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు.ఉద్యోగులు, విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!


ధనుస్సు రాశి


ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. మిత్రుల సాంగత్యం వల్ల ఆనందం రెట్టింపు అవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఈ సమయంలో మీరు పనిని భారంగా భావిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రసంగం తీవ్రంగా మారకూడదని గుర్తుంచుకోండి. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండకూడదని గుర్తుంచుకోండి.


మకర రాశి


ఈ రోజు మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ మనస్సు నుంచి ప్రతికూల ఆలోచనలు తొలగిపోయినప్పుడు తేలికగా ఉంటారు. అనైతిక పని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. వీలైతే వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మధ్యాహ్నం తర్వాత శుభవార్త వింటారు. రచన లేదా సాహిత్య ధోరణిలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధికి కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. సన్నిహితులతో వాగ్వాదానికి దిగవద్దు


కుంభ రాశి


ఈ రోజు ఈ రాసివారు వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. సోమరితనం ,  ఆందోళన ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగవద్దు. అగ్ని మరియు నీరు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. లావాదేవీల విషయాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సమాచారం లభిస్తుంది. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది.


మీన రాశి


ప్రయాణానికి ఈరోజు మంచి రోజు. వ్యాపార సంబంధిత పనులలో లాభదాయకమైన ప్రారంభం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. షేర్ స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లే కార్యక్రమం ఉంటుంది. ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది. మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీరు పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్య పరంగా రోజు మంచిది.