ప్రశ్న: మాది ఉమ్మడి కుటుంబం. అత్తయ్య మామయ్యలు మాతోనే ఉంటారు. నా భర్తకు, మా అత్తగారికి అనుబంధం ఎక్కువ. ఆయనకు పెళ్లయిన తర్వాత కూడా మా అత్తగారు అన్ని పనులు చేసి పెడుతున్నారు. చివరికి ఆయనకి లంచ్ బాక్స్ పెట్టే అవకాశం కూడా నాకు ఇవ్వడం లేదు. ఇంట్లో మా ఇద్దరం భార్యాభర్తల్లా కాకుండా కేవలం రూమ్మేట్స్‌లా ఉండాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి మధ్యలో మా అత్తగారే వచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి మా పెళ్లిరోజున ఏ రెస్టారెంట్లో మేం డిన్నర్ తినాలో కూడా ఆవిడే నిర్ణయిస్తున్నారు.  ఆవిడ ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు. మా ఇద్దరికీ ఎలాంటి స్పేస్‌ను ఇవ్వడం లేదు. ఇంట్లో ఉండాలంటేనే నాకు విసుగ్గా అనిపిస్తుంది. అందుకే మాకంటూ సమయం కావాలని  వారం రోజులు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాం నా భర్తా, నేను. అక్కడికి కూడా మా అత్తగారు వస్తానని పట్టుబడుతోంది. నా భర్త తన తల్లికి రావద్దని చెప్పలేరు. నేను తీవ్ర నిరాశలో కూరుకు పోతున్నాను. మా ఇద్దరికీ ఏకాంతం కావాలని మా అత్తగారికి చెప్కపడం ఎలా? ఆవిడకి అర్థం అయ్యేలా చెప్పడం ఎలా?


జవాబు: పూర్వం ఒక సామెత ఉండేది... అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తింటికి వెళితే కేవలం అబ్బాయిని మాత్రమే కాదు ఆ కుటుంబం మొత్తాన్ని పెళ్లి చేసుకున్నట్టే అని. కానీ ఆధునిక కాలంలో ఆ సామెత కనుమరుగైపోయింది. చిన్న కుటుంబాలు  ఎక్కువ అవ్వడంతో ఆ సామెతకు ప్రస్తుతం అర్థం లేకుండా పోయింది. కానీ మీ విషయంలో మాత్రం ఇంకా ఆ సామెత నిజమని అర్థమవుతోంది. మీ అత్తకు ఒక్కరే కొడుకు కావడం కూడా ఆమె అతి ప్రేమకు కారణం కావచ్చు. పుట్టినప్పటినుంచి తన కొడుకుకి అన్ని తానే చేసిన ఆ తల్లి, ఇప్పుడు కోడలు ఎంట్రీతో ఆ పనులు మానలేకపోతున్నారు. ఆమె ఎమోషనల్ గా కొడుకు పై చాలా ఆధారపడి ఉన్నారు. కొందరు తల్లుల్లో... కోడలు వచ్చాక కొడుకు తనకు దూరమవుతాడని భయం కూడా ఉంటుంది. అందుకోసం కూడా అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ ప్రవర్తన వల్ల అత్తా కోడళ్ల మధ్య గొడవలు పెరుగుతాయి. అయితే మీరు చదువుకున్నవారు. గొడవలకు దిగకుండా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు, మీ భర్త కూడా సహకరించాలి. ఇన్నాళ్లు తల్లి చుట్టూ తిరిగిన అతను, ఇప్పుడు భార్యకు కూడా కొంత స్పేస్  ఇవ్వాలని అర్థం చేసుకోవాలి. దీన్ని మీరు మాత్రమే సాల్వ్ చేసుకోగల సమస్య కాదు, మీ భర్త మొదటగా దీన్ని సాల్వ్ చేయాలి. తన తల్లితో మాట్లాడి భార్యతో గడిపేందుకు కొంత సమయాన్ని ఇవ్వమని అడగాలి. అలాగే మీరు కూడా మీ అత్త నుంచి ఎప్పుడు మీ భర్తను దూరం చేయననే నమ్మకం ఆవిడలో కలిగించేలా ఉండాలి.



Also read: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం



























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.