DIY Remedies for Dry Lips : చలికాలంలో పొడివాతావరణం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం, జుట్టు పొడిబారుతూ ఉంటుంది. వాటితో పాటు పెదాలు కూడా బాగా డ్రై అయిపోతాయి. పగిలిపోయి బ్లెడ్ రావడం, మంట, నొప్పి రావడం వంటివి జరుగుతుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారి. పైగా పొడిబారిన పెదాలు, పగిలిన లిప్స్ లుక్​ని మొత్తంగా మార్చేస్తాయి. అందుకే లిప్స్ విషయంలో కాస్త ఎక్స్​ట్రా కేర్ తీసుకోవాలి.


పెదాలు పొడిబారడాన్ని తగ్గించి.. పగలకుండా చేసే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వాలి. అలాగే పెదాలకు మాయిశ్చరైజర్​ను అందించి సమస్యరాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్, జాగ్రత్తలు ఏంటి? నిజంగా పెదాలు మాయిశ్చరైజ్ అవుతాయి. పొడిబారడం తగ్గుతుందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు


హైడ్రేషన్ : పెదాలే కాదు మొత్తం బాడీ పొడిబారకుండా ఉండాలంటే మీరు నీళ్లు తాగాలి. శరీరానికి తగినంత నీరు అందిస్తే చర్మం పొడిబారదు. పెదాలు కూడా డ్రై కాకుండా ఉండాయి. మాయిశ్చరైజ్​ అంది.. హైడ్రేటెడ్​గా ఉంటాయి.


ఆ తప్పు చేయొద్దు : పెదాలు పొడిగా ఉంటే కొందరు అదే పనిగా పెదాలను నాలికతో తడి చేస్తూ.. లిక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల పెదాలు ఇంకా డ్రై అయిపోతాయి. పెదాలపై స్కిన్​ ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా అస్సలు చేయవద్దు. 


మాస్క్ :  బయటకు వెళ్లినప్పుడు చలిగాలి ఎఫెక్ట్ పెదాలపై పడకుండా.. మాస్క్​ లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇవి పెదాలు డ్రై కాకుండా.. కాపాడుతాయి. 


అవి వద్దు : పెదాలకు ఇబ్బంది కలిగించే లిప్​స్టిక్​లు, కొన్ని రకాల ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఇవి పెదాలను మరింత డ్రైగా చేసి.. పరిస్థితిని దారుణంగా మారుస్తాయి. 


ఇంటి చిట్కాలివే (Homemade DIY Remedies)


లిప్​ బామ్ : ఓ గిన్నెలో తేనె, కొబ్బరి నూనెను సమానంగా తీసుకోవాలి. ఈ రెండింటీని బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక లిప్​ బామ్​గా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండూ పెదాలను బాగా హైడ్రేట్ చేసి.. పొడిబారడాన్ని దూరం చేస్తాయి. 


లిప్ స్క్రబ్ : షుగర్​, ఆలివ్​ ఆయిల్​ను సమానంగా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పంచదార తీసుకుంటే.. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి.. స్క్రబ్​గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి స్క్రబ్ చేయాలి. దీనివల్ల పెదాలు స్మూత్​గా తయారువుతాయి. డెడ్​స్కిన్ వదిలి.. మాయిశ్చరైజ్ అవుతాయి. 


అలోవెరా జెల్ : ఇంట్లో అలోవెరా ఉంటే చాలు. దానిని కాస్త తుంచి.. ఆ జెల్​ని పెదాలకు నేరుగా అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదాలు డ్రై కావు. పైగా పిగ్మెంటేషన్​ కూడా దూరమవుతుంది. 


లిప్ మాస్క్ : కీరదోస జ్యూస్​ను 1 టేబుల్​ స్పూన్​ తీసుకుని.. దానిలో 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ వేసి.. బాగా కలపాలి. దానిని పెదాలకు​ మాస్క్​గా వేసుకోవాలి. ఇది పెదాలను డ్రై కాకుండా జ్యూసీగా చేస్తుంది. 


లిప్ ట్రీట్​మెంట్ : పెదాలకు దాదాపు అందరూ వాజిలెన్ రాస్తుంటారు. అయితే ఈ వాజిలెన్​లో నిమ్మరసం వేసి.. దానిని పెదాలకు అప్లై చేస్తే పెదాలపై ఉండే డర్ట్ పోతుంది. అలాగే పెదాలు మాయిశ్చరైజ్ అవుతాయి. 



మరిన్ని జాగ్రత్తలు


ఎక్స్​ఫోలియేషన్ : పెదాలను రెగ్యులర్​గా స్రబ్ చేస్తే.. పెదాలపై ఉండే డర్ట్ పోతుంది. అలాగే పెదాలు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. పెదాలను కాపాడుకోవడంలో ఎక్స్​ఫోలియేషన్​ కీ ఫ్యాక్టర్​గా చెప్పొచ్చు. 


లిప్​ బామ్​ : SPF ఉండే లిప్​ బామ్​ను కూడా ఉపయోగిస్తూ ఉంటే UV కిరణాలనుంచి పెదాలను కాపాడుకోవచ్చు. పిగ్మెంటేషన్​ కూడా తగ్గుతుంది. 


పెదాలను తడి చేయకండి : పెదాలను హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలి కానీ.. ఊరికే నాలుకతో తడపకూడదు. ఇలా చేస్తే పెదాలు పొడిబారడమే కాకుండా నల్లగా మారుతాయి.



ఈ టిప్స్​ని వింటర్​లో ఫాలో అయితే అందమైన పెదాలు మీ సొంతమవుతాయి. అంతేకాకుండా పెదాలు పొడిబారవు. పగలకుండా హెల్తీగా, పిగ్మెంటేషన్​ లేకుండా అందంగా మారుతాయి.


Also Read : లిప్ ఫిల్లర్స్​లోని రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బెనిఫిట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే