ఒకప్పుడు లిప్‌స్టిక్ రాసుకోవడం అనేది పాశ్చాత్య సంస్కృతి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎంతోమంది యువత లిప్‌స్టిక్ వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందులో రకరకాల షేడ్స్ ను ట్రై చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఎన్నో మెట్రో నగరాల్లో నైట్ పార్టీలతో పబ్బులు బిజీగా మారిపోతాయి. పార్టీకి వెళ్లే వారు ఎదుటివారిని ఎలా ఆకట్టుకోవాలో తెలుసుకోండి. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మీ భాగస్వామితో విందుకు హాజరవుతున్నా, స్నేహితులతో పార్టీకి వెళ్తున్నా... అందర్నీ ఆకట్టుకునే లిప్‌స్టిక్ షేడ్స్ ఇవే. ఇవన్నీ కూడా మార్కెట్లో దొరికేవే.  


క్లాసిక్ రెడ్
వాలెంటెన్స్ సీజన్లో రెడ్ కలర్ విలువ మరింత పెరిగిపోతుంది. అందుకే ఈరోజున క్లాసిక్ రెడ్ షేడ్ వేసుకునే అమ్మాయిలు కూడా అధికమే. చెర్రీ పండులా పెదవులు మెరిసేలా చేస్తుంది. ఏ రంగు ముఖం అయినా ఈ రంగు సెట్ అవుతుంది. 


ప్రెట్టీ పింక్
ఎరుపు రంగు తర్వాత ఎక్కువ మంది మనసు దోచేది గులాబీ రంగు. ముఖ్యంగా మిలీనియల్స్ నచ్చే లిప్‌స్టిక్ షేడ్ ఇదే. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, పెదవులకు నేచురల్‌గా రంగు వేసినట్టుగా ఉంటుంది. ఇందులో ఫ్యూషియా లేదా బేబీ షెడ్ వేస్తే బాగుంటుంది. ఏ చర్మపురంగు వారికైనా పింక్ చక్కగా నప్పేస్తుంది.


న్యూడ్ మాటే
మెరిసే పెదవులను అందిస్తుంది న్యూడ్ మాటే షేడ్. న్యూడ్ మాటే షేడ్ వేస్తే పెదవులు అప్పుడే నీటి జల్లులో తడిసిన గులాబీ రేకుల్లా తాజాగా కనిపిస్తాయి. అందుకే చాలామంది నైట్ పార్టీలకు ఈ షేడ్ వేసుకునేందుకు ఇష్టపడతారు.


వైబ్రేంట్ గ్లాస్
మెరిసే పెదవుల కోసం కొత్తగా ప్రయత్నిస్తున్న షేడ్ ఇది. పార్టీలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ వైబ్రేంట్ గ్లాస్ వేసుకోండి. పెదవులు మిలమిల మెరుస్తూ కనిపిస్తాయి. ఈ వైబ్రేంట్ గ్లాస్ షెడ్ పెదవులకు వేసుకున్నాక, చెంపలకు కాస్త పింక్ బ్లష్ కొడితే ఆ రెండింటి జత అదిరిపోతుంది.


పీచ్ షేడ్
పీచ్ కలర్ ప్రేమికుడితో డేట్ నైట్ వెళ్లేందుకు సెట్ అయ్యే షేడ్ ఇది. దీని మీడియం టోన్‌లోనే రాసుకోవాలి. అదే లైట్ టచ్ చేస్తే సహజత్వంతో ఆకర్షిస్తాయి. వీలైతే మీ నైట్ పార్టీకి పీచ్ కలర్ ట్రై చేయండి. 


రాత్రి నిద్రపోయే ముందు మాత్రం లిప్ స్టిక్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. లేకుంటే పెదవులు తమ సహజత్వాన్ని కోల్పోతాయి. తేనేలో కాస్త చక్కెర వేసి పెదవులను రుద్దితే లిప్ స్టిక్ మొత్తం పోతుంది. ఇది పెదవుల క్లీనింగ్‌కు సహజమైన పద్ధతి.


Also read: ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి, దీనితో ఎన్నో ఉపయోగాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.