అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు ఉపయోగించే బదులు ఇంట్లో దొరికే వాటిని వాడితే సహజమైన అందం మీ సొంతం అవుతుంది. అందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగించేది పెరుగు. భారతీయులు పెరుగు తినకుండా భోజనం ముగించరు అంటే దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పెరుగు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా కాపాడుతుంది. చర్మానికి మరింత శోషణ ఇచ్చి సహజమైన మెరుపు వచ్చేలా చేస్తుంది. పెరుగుతో ఫేస్ ప్యాక్ వంటివి వేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.


☀ మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్‌లోని రసాయనాల సమ్మేళనాలు చర్మాన్ని చికాకు పెడుతాయి. కానీ పెరుగు పెరుగు రాసుకోవడం వల్ల చర్మం సున్నితంగా ఉంటుంది. ఎటువంటి చర్మం కలిగిన వాళ్ళకి అయినా ఇది చక్కగా సరిపోతుంది.


☀ ఎక్కువ మంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్య మొటిమలు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే పెరుగు రాసుకోవచ్చు. ఇది చర్మానికి అవసరమైన సహజ యాంటీ మైక్రోబయల్ పెప్టైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మొటిమలు కలిగించే బ్యాక్టీరియా స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.


☀ ఇది చర్మ మైక్రోబయోమ్ బ్యాలెన్సింగ్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వీటి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన సూక్ష్మజీవులకు సహకరిస్తుంది.


☀ చాలామందికి చర్మం పొడిబారడం సమస్యగా మారుతుంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పెరుగులో ప్రొ బయోటిక్ సమ్మేళనాలు ఉన్నాయి. మొటిమలు సమస్య ఉన్నవాళ్ళు పెరుగు తీసుకోవడం వల్ల చర్మం సాధరణం కంటే మరింత సమర్థవంతంగా తేమను నిలుపుకుంటుంది.


☀ పెరుగు సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇది నిజానికి ఇతర సౌందర్య సాధనాల కంటే చర్మాన్ని బాగా రక్షిస్తుంది. పెరుగుతో ఫేస్ మాస్క్ తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. మొహం మీద గీతలు, ముడతలు తగ్గిస్తుంది. తేమను అందిస్తుంది. ముఖానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది.


☀ తామర వంటి చర్మ సమస్యల్ని నివారించడంలో పెరుగు సహాయకారిగా ఉంటుంది. ఇందులోని ఎంజైమ్ లు చర్మం లోతుగా వెళ్ళి వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాని అంతం చేస్తాయి.


☀ పెరుగు ప్రభావాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. పులియబెట్టిన పెరుగు వాడటం వల్ల చర్మానికి హాని చేసే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. మొహం మీద మచ్చలు పోగొడుతుంది. చర్మం రంగుని మార్చడంలో సహాయపడుతుంది.


☀ ఇది సిరామైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. పెరుగు.. పెప్టైడ్, లాక్టిక్ యాసిడ్, హైలురోనిక్ యాసిడ్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. చర్మం పొడి బారిపోకుండా తేమగా ఉంచుతూ ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తుంది.


☀ యాంటీ ఏజింగ్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. మీ మొహంలో ముసలితనం కనిపించకుండా చేస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. చర్మానికి ప్రతిరోజు పెరుగు పూయడం వల్ల ముడతలు, వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలను దూరం చేస్తుంది. చర్మానికి వైద్యం చేసే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఇలా చేశారంటే మీ కంటి చూపుకి ఏ ఇబ్బంది ఉండదు, కళ్ళజోడు అవసరమే రాదు