Skin Care Routine for Glowing Skin in Monsoon : చాలామంది సమ్మర్​లోనే స్కిన్​ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ సీజన్ మారిన ప్రతిసారీ ఈ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో స్కిన్ ర్యాషెష్ ఎక్కువగా ఇబ్బందిపెడతాయి. అలాగే చర్మాన్ని టాన్ చేస్తాయి. అదేంటి ఎండలేకుండా స్కిన్ టాన్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? అయితే మీరు స్కిన్​ కేర్​ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి? డ్రై స్కిన్​ కేర్, ఆయిల్​ స్కిన్​ కేర్​, కాంబినేషన్ స్కిన్​ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు ఇవే..


వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. తేమ అధికంగా ఉండి.. చెమట ఎక్కువ పడుతుంది. దీనివల్ల మొటిమలు సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. అంతేకాకుండా చర్మం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. దీనిని కంట్రోల్ చేయడానికి డియోడరెంట్స్ వాడితే అలెర్జీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. స్కిన్​పై దద్దుర్లు రావొచ్చు. కాబట్టి ఈ సమస్యను దూరం చేసుకునేందుకు కాటన్ దుస్తులు ధరించాలి. సహజమైన డియోడ్రెంట్స్ ఎంచుకుంటే మంచిది. స్కిన్​ ఇన్​ఫెక్షన్లు, తామర వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. 


ఈ టిప్స్ ఫాలో అయితే బెస్ట్​..


వారానికి ఓసారి స్కిన్​ను ఎక్స్​ఫోలియేట్ చేయాలి. దీనివల్ల డెడ్​ స్కిన్​ సెల్స్​ తొలగి.. చర్మం క్లియర్ అవుతుంది. మొటిమలు తగ్గుతాయి. చాలామంది చేసే తప్పు ఏంటంటే.. సన్​స్క్రీన్​ని వాడరు. వర్షాకాలంలో కూడా సన్​స్క్రీన్ వాడాలి. ఆయిల్ స్కిన్​ ఉంటే మ్యాట్​ ఫినిషింగ్ సన్​స్క్రీన్ వాడాలి. మేకప్​ ఎప్పుడూ మినిమల్​గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వర్షంలో తడిచినా.. మేకప్​ చర్మంపై ఇబ్బంది కలిగించదు. మాయిశ్చరైజర్​ కూడా తేమ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం పొడికాకుండా కాపాడుతుంది. ఆయిల్ స్కిన్​ ఉంటే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్​ని ఎంచుకోవాలి. 


ఆయిల్ స్కిన్ ఉంటే.. 


వర్షాకాలంలో ఎక్కువ డ్యామేజ్​ అయ్యే అవకాశాలు ఆయిల్ స్కిన్ వాళ్లకే ఉంటాయి. ఎందుకంటే జిడ్డుచర్మం మరింత జిడ్డుగా మారుతుంది. కాబట్టి కనీసం రోజుకి రెండుసార్లు మైల్డ్ ఫేస్ వాష్​తో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. మధ్యలో టిష్యూలతో స్కిన్​పై ఉన్న ఆయిల్​ని తొలగించవచ్చు. స్కిన్ హెల్తీగా ఉండేందుకు మైల్డ్ టోనర్​ని ఉపయోగించాలి. మాయిశ్చరైజర్​ని కూడా అప్లై చేయాలి. వారానికోసారి క్లేమాస్క్​ వేయాలి. ఇది జిడ్డును కంట్రోల్ చేస్తుంది. 


పొడి చర్మమైతే.. 


పొడి చర్మం ఉన్నవారు రెగ్యూలర్​గా స్కిన్​ను వాష్​ చేసి.. చర్మానికి మాయిశ్చరైజర్​ అప్లై చేయాలి. వర్షంకాలంలో చాలామంది నీటిని ఎక్కువగా తాగరు. దీనివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. కాబట్టి మంచి నీటిని తాగుతూ ఉండాలి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల వేడినీళ్లతో స్నానం చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. మేకప్​ తీయకుండా నిద్రపోకూడదని గుర్తించుకోండి. వారానికోసారి హైడ్రేటింగ్ ఫేస్​ మాస్క్​ని వేసుకోవాలి. 



వర్షం వచ్చినా.. ఎండ ఉన్నా.. స్కిన్​ని శుభ్రపరచడం చాలా ముఖ్యం. టోన్​ చేయడం, హైడ్రెటెడ్​గా ఉంచుకోవడం బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అలాగే సీజన్​కి తగ్గట్లు స్కిన్​ కేర్​ ప్రొడెక్ట్స్ ఎంచుకోవాలి. సీజన్​కి తగ్గట్లు మేకప్​ని చేసుకోవాలి. స్కిన్​ కేర్​ రోటీన్​లో కూడా పలు మార్పులు చేయాలి. అప్పుడే చర్మ సమస్యలు రాకుండా స్కిన్ హెల్తీగా ఉంటుంది. వర్షంలో తడిసిన తర్వాత స్కిన్ ఇన్​ఫెక్షన్ వస్తే దానిపై ఎలాంటి ప్రొడెక్ట్స్ వాడకుండా వైద్యులను సంప్రదించండి. 


ఎందుకంటే వర్షాకాలంలో స్కిన్​ ఇన్​ఫెక్షన్లు త్వరగా వస్తాయి. అందుకే ముఖానికే కాకుండా చర్మాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్​ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి స్కిన్​ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకునేలా చూసుకోండి. తేమను పోగొట్టే డ్రెస్​లు వేసుకుంటే మంచిది. రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తూ.. స్నానం చేస్తే శరీరంపై ఉన్న డర్ట్ పోతుంది. 


Also Read : ఆ ఫాస్టింగ్​తో 21 రోజులలో 13 కిలోలు తగ్గాడట.. నిజంగానే బరువు తగ్గుతారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?