Skincare Tips: అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. చాలా మంది తాత్కాలిక అందం కోసం మేకప్ వేసుకుంటారు. దీనికి బదులుగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. చర్మం శరీరంలోని అతిపెద్ద అవయవం. హానికరమైన జెర్మ్స్, బ్యాక్టీరియా శరీరంలోకి రాకుండా అడ్డుకునే ఒక డిఫెన్స్ సిస్టమ్. చర్మాన్ని ఆరోగ్యంగా, గ్లోయింగ్ గా ఉంచేందుకు రోజూ స్కిన్ కేర్ టిప్స్ పాటించడం తప్పనిసరి. పడుకునే ముందు సాధారణ చిట్కాలు ఫాలో అయితే ..కొన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


మీ చర్మం, దుమ్ము, మలినాలు, వడదెబ్బతో పాలిపోయినప్పటికీ..రాత్రి అనేది ముఖంలో చైతన్యం నింపుతుంది. ఇది మీకు ప్రకాశవంతమైన , అందమైన చర్మాన్ని అందిస్తుంది. మీరు హాయిగా నిద్రిస్తే శరీరానికి అది బలం ఇస్తుంది. రాత్రిపూట అదే బ్యూటీ చిట్కాలను పాలో అయితే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. మీ చర్మం గురించి ఎంత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటే.. వృద్ధాప్య సంకేతాలు కూడా అంతే తక్కువగా ఉంటాయి. ముఖానికి ఒకసారి మచ్చలు కనిపిస్తే..వాటిని తొలగించుకోవడం చాలా కష్టమవుతుంది. కాలు మడమ, కంటి దిగువ భాగం, పెదవులు, గోర్లు మొదలైనవి రాత్రి చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తాయి.  స్కిన్ కేర్ కోసం రాత్రి పడుకునే ముందు  ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన కొన్ని అలవాట్లు ఏంటో చూద్దాం. 


సిల్క్ పిల్లో కేసులు కవర్స్:


రాత్రి నిద్రించేప్పుడు చాలా మందికి పిల్లో వాడటం అలవాటు. కొంతమంది పిల్లో లేకుంటే పడుకోలేరు. అయితే పిల్లోకు కవర్ కాటన్ కంటే సిల్క్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సిల్క్ పిల్లో కవర్లు ముడతలు లేకుండా ఉంటాయి. సహజ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. 


రెగ్యులర్ గా ఫేస్ మాస్కులు:


చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేస్ చేసి.. గ్లోయింగ్ తీసుకువచ్చేందుకు ఓవర్ నైట్ ఫేస్ మాస్కులు చాలా ప్రయోజకరంగా ఉంటాయి. వీటిలో  విటమిన్ సి లేదా హైలురోనిక్ యాసిడ్ వంటి మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉంటాయి. స్మూత్ గా, బొద్దుగా, కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే రెగ్యులర్ గా ఫేస్ మాస్కులు వేసుకోవాలని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. 


జెడ వేసుకోవడం:


మీ జుట్టును వదిలివేయకుండా.. బన్నులో కానీ జడకానీ వేసుకుంటే ఉదయాన్నే జుట్టు చిక్కులు కాకుండా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుంటే జుట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. 


పెట్రోలియం జెల్లీని ఉపయోగించండి:


మీ ముఖం, జుట్టుతోపాటు పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అవి మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మీ పాదాలను స్మూత్ గా, అందంగా కనిపించాలంటే గోరువెచ్చని నీటిలో శుభ్రం చేయాలి. పాదాలను ఎప్పుడూ పొడిగా ఉంచాలి. తర్వాత చర్మం పొడిబారకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీని అప్లయ్ చేయండి. 



టోనర్ ను ఉపయోగించడం:


చర్మం బ్యాక్టీరియాకు అడిక్ట్ అవ్వగుండా ఉండేందుకు, దాని సహజ పీహెచ్ స్థాయిలను పునరుద్ధరించడానికి, మురికిని తొలగించడానికి టోనర్ ఉపయోగించడం మంచిది. మీ అందాన్ని మరింత మెరుగుపరిచేందుకు కాటన్ ప్యాడ్ పై కొద్దిగా టోనర్ వేసి ముఖం, మెడపై సున్నితంగా తుడవండి. 


Also Read : వ్యాయామం ఉదయాన్నే చెయ్యాలా ఏంటీ? కొత్త అధ్యయనంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడి











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.