అందాన్ని పెంచే కాస్మోటిక్స్‌లో ఎన్నో రకాల పండ్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు అధికంగా ‘యుజు’ అనే పండును ఉపయోగిస్తున్నారు. ఇది తూర్పు ఆసియాకు చెందిన సిట్రస్ ఫ్రూట్. ఈ పండు.. రెండు రకాల సిట్రస్ జాతికి చెందిన చెట్ల సంకరణ వల్ల పుట్టిన చెట్టుకు కాసినది. ఇది పసుపు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని రుచి ద్రాక్ష పండు, నిమ్మ కలిపి తింటే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది. దీన్ని సలాడ్‌లలో, డ్రింకులు, డిసర్ట్ తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. 


1. యుజు పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయల కంటే రెండు రెట్లు, నారింజ కంటే ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి దీనిలో ఉంటుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.


2. యుజు పండులో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇది చర్మాన్ని తేమఉంచడంలో సహాయపడుతుంది.


3. యుజు ఫ్రూట్‌లోని విటమిన్ సి, పాలీఫెనాల్స్ చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మలినాలను, టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడతాయి.


4. యుజు పండు చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది డార్క్ స్పాట్స్, రంగు మారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.


5. యుజు పండులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మొటిమలు, ఇతర చర్మ వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి.


యుజు పండును ఎలా ఉపయోగించాలి?
1. యుజు పండును రసాన్ని లేదా గుజ్జును... పెరుగు, తేనెలో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును ముఖంపై అప్లయ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రకాశవంతంగా మారుస్తుంది.  
2. యుజు  పండు రసం,  బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ కలిపి బాడీ స్క్రబ్‌ను తయారుచేసుకోవాలి.  ఆ స్క్రబ్‌తో రుద్దితే చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. 
3. మీ స్నానంలో యుజును ఉపయోగించండి. మీ శరీరం మరియు మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి మీ స్నానపు నీటిలో కొన్ని చుక్కల యుజు ముఖ్యమైన నూనెను జోడించండి.
4. యుజు రసాన్ని, తేనె, అవకాడో పండు గుజ్జు కలిపి హెయిర్ మాస్క్‌ని తయారుచేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టుకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బలంగా మారుతాయి.  
5. పెదవుల కోసం యుజు స్క్రబ్ తయారుచేసుకోవచ్చు. యుజు జ్యూస్, చక్కెర, కొబ్బరి నూనెను కలపడం ద్వారా  స్క్రబ్‌ను చేయచ్చు. దీనితో పెదవులపై రుద్దితే మృత కణాలు పోయి, పెదవులు గులాబీ రంగులో మెరుస్తాయి. 


Also read: అలాంటి ఉద్యోగాలు చేసే మగవారిలో వీర్యకణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం - చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.