టాలీవుడ్లో జోరు మీదున్న హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ మూవీలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాల దాకా ఉన్నాయని అంచనా. ఇంత బిజీలో కూడా చర్మ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తుంది రాశి. ఎక్కువగా ఇంటి చిట్కాలనే పాటిస్తుంది. ఆ చిట్కాలు మీకోసం...
1. సెలెబ్రిటీలకు కూడా మొటిమల సమస్య సాధారణమే. ముఖంపై మొటిమ వస్తున్నట్టు అనిపించగానే రాశి బొప్పాయి గుజ్జును అప్లయ్ చేస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమలను నిరోధిస్తుంది.
2. ఆమె మెరిసే చర్మం వెనుక రహస్యం ముల్తాని మిట్టి. తరచూ ముల్తాని మిట్టితో ఫేస్ ప్యాక్ లు వేసుకుంటుంది రాశి. ముల్తానిమిట్టి చర్మరంధ్రాల్లోని నూనెను తీసివేస్తుంది. టానింగ్ నుంచి, పిగ్మెంటేషన్ నుంచి కాపాడుతుంది.
3. అప్పుడప్పుడు అలోవెరా జెల్ ను కూడా అప్పుడప్పుడు చర్మాన్ని మెరిపించేందుకు ఉపయోగిస్తుంది. రాశినే కాదు, మీరు కూడా రోజూ కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. పొడిచర్మం ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. ముఖంపై చారలు, మొటిమలను ఇట్టే మాయం చేస్తుంది.
4. తినే ఆహారం కూడా చర్మసౌందర్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే రాశి తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తన డైట్ లో భాగంగా తీసుకుంటుంది. బ్రాకోలి, స్వీట్ పొటాటోలు, టమోటాలు, ఎరుపు, పసుపు క్యాప్సికమ్, గ్రీన్ టీ, ద్రాక్ష పండ్లు, సోయా వంటివి, వాల్ నట్స్, అరటి పండు, పాలకూర వంటివి మీరు కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే... మీ చర్మం మెరుపులీను తుంది.
5. చాలా మంది అతిగా మేకప్ వేసుకుంటారు. సినిమాల్లో చేసేప్పుడు రాశికి కూడా తప్పదు. కానీ షూటింగ్ పూర్తవ్వగానే మేకప్ మొత్తం తీసేస్తుంది రాశి. చర్మ రంధ్రాలకు తాజా గాలితో ఊపిరులూదుతుంది. నిత్యం మేకప్ ల వల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోతాయి. అందుకే ఎవరైనా సరే ఉదయమంతా ఎంత మేకప్ వేసుకున్నా, రాత్రి మాత్రం మొత్తం మేకప్ ను తొలగించడం అత్యవసరం.
Also read: బెల్లం, పంచదారల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?
Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు
Also read: ఏ వయసులో ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే మేలు? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?