ఇప్పుడు వయసు తేడా లేకుండా చిన్నా పెద్దా అంతా ప్రోటీన్ షేకులు తాగడం మొదలుపెట్టారు. కొంతమంది వైద్యుల సూచనతో తాగుతుంటే, మరికొందరు మాత్రం వ్యక్తిగత ఇష్టంతో సేవిస్తున్నారు. అలా అవసరం లేకుండా కూడా అధిక ప్రోటీన్ ను తీసుకోవడం మంచిది కాదు. కొత్తగా చేసిన ఓ అధ్యయనంలో ఏ వయసులో ప్రోటీన్ షేకులు తీసుకుంటే లాభమో బయటపడింది.
కెనడాలోని మెక్మాస్టర్ యూనివర్సిటీలో వారు అధ్యయనంలో ప్రోటీన్ షేక్ లను 70లలో ఉన్నవారు, అంతకన్నా వయసు ఎక్కువ ఉన్న వారు తీసుకుంటే చాలా లాభమని, వారికి శారీరకంగా శక్తి లభిస్తుందని తేల్చారు. ఇందుకోసం కొంతమంది వృద్ధులను ఎంచుకున్నారు. వారిలో సగం మందికి ఆరు వారాల పాటూ ప్రోటీన్ షేక్ ను తాగిపించారు. మిగతా సగం మందికి ఏమీ ఇవ్వలేదు. ఆ తరువాత 12 వారాల పాటూ రెండు గ్రూపుల్లోని వారికి ప్రోటీన్ షేక్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే సులువైన ఎక్సర్ సైజులు కూడా చేయించారు. ఆ తరువాత పరీక్ష చేస్తే మొదట్నించి పోట్రీన్ షేక్ లు తాగిన వారి కండల్లో పెరుగుదల కనిపించింది. వారి శారీరక శక్తి కూడా పెరిగింది. అంతేకాదు వారు మానసికంగా కూడా ధృఢంగా తయారయ్యారు.
ప్రోటీన్ సరిగా అందని వృద్ధులు తమ రోజువారీ పనులను కూడా సరిగా చేసుకోలేరు. నడవడం, కుర్చీలోంచి లేవడం కూడా వారికి కాస్త కష్టంగానే అనిపిస్తాయి. కానీ ప్రోటీన్ షేకులు తీసుకునేవారిలో ఈ పనులు సులభతరం అయినట్టు అధ్యయనంలో తేలింది.
మీరు తినే ఆహారం నుంచి తగినంత ప్రోటీన్ అందకపోతే, న్యూట్రిషనిస్టును కలిసి సలహా తీసుకోవడం మంచిది. వారు మీకు సరైన ప్రిస్క్రిప్షన్ ను సూచిస్తారు. మీకు తెలియకుండా అతిగా తీసుకున్నా పలు ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు ప్రోటీన్ లోపం ఉందనిపిస్తే వెంటనే పోహకాహార నిపుణులను కలవండి.
గమనిక- ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వైద్యుని సలహాకు ప్రత్నామ్నాయం మాత్రం కాదు. మరిన్ని వివరాల కోసం వైద్యుడిని సంప్రదించగలరు.
Also read: బెల్లం, పంచదారల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?
Also reda: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు
Also read: షుగర్ వ్యాధి ఒంట్లో చేరి ఏం చేస్తుందో తెలుసా... జాగ్రత్త పడండి
Also read: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...