Bathukamma Significance : తెలంగాణ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ(Bathukamma 2024) ఒకటి. ప్రకృతిని, స్త్రీని ఆరాధిస్తూ.. సమాజంతో తమ బంధాన్ని మమైకం చేసుకుంటూ ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు.. ప్రపంచంలో ఎక్కడున్నా.. ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన బతుకమ్మను మొదలు పెట్టి.. 9వ తేదివరకు దీనిని కొనసాగిస్తారు. తొమ్మిది రోజులు చేసే ఈ బతుకమ్మను రోజుకో పేరుతో పిలుచుకుంటారు. అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి? దీనిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ప్రాముఖ్యత ఇదే..
ప్రతి ప్రాంతానికి కొన్ని రకాల పండుగలు ఉంటాయి. తెలంగాణలో కూడా అలా కొన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి వాటిలో ఒకటి బోనాలు అయితే.. మరొకటి బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పండుగను పెద్ద స్థాయిలో చేసుకోవడం ప్రారంభించారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతుంది. దసరా సమయంలో వచ్చే ఈ పండుగను చిన్నా.. పెద్దా.. తేడా లేకుండా అందరూ దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళను గౌరవిస్తూ.. ప్రకృతితో మమైకమై చేసుకునే ఈ పండుగకు మంచి గుర్తింపు ఉంది.
ప్రకృతితో మమేకమై..
బతుకమ్మను వివిధ రకాల పూలు, వివిధ నైవేద్యాలతో బతుకమ్మను తయారు చేస్తారు. అడవి పూలను సేకరించి.. వివిధ డిజైన్లలో, వారి అభిరుచికి తగ్గట్లుగా బతుకమ్మను తయారు చేసి.. దాని చుట్టూ బతుకమ్మ ఆడుతారు. ప్రకృతి నుండి లభించే వాటికి.. ప్రకృతి మాత ప్రసాదించిన వరాలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను చేసుకుంటారు. అందుకే పండుగ కోసం అడవి పూలను పోగు చేసి.. కలర్ఫుల్గా బతుకమ్మను తయారు చేసి.. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.
స్త్రీ శక్తిని గౌరవిస్తూ..
చాలామంది ఈ పండుగను కేవలం మహిళలే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటారు కానీ.. దీని వెనుకు అసలైన అర్థం వేరు ఉంది. స్త్రీ శక్తికి ప్రతీకగా ఈ పండుగను చేసుకుంటారు. స్త్రీ దృఢత్వాన్ని, దయను గుర్తు చేస్తూ.. స్త్రీలు ఒకరితో ఒకరు కలిసి.. తమ స్త్రీత్వాన్ని జరుపుకుని చేసే పండుగ ఇది. అందుకే ప్రతి ఆడబిడ్డ తమ ఇంటికి వెళ్లి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఒకరికొరు తోడుగా, మద్ధతుగా ఉండాలని సూచిస్తూ.. బతుకుమ్మ చుట్టూ చేరి.. అందరూ కలిసి ఆడి పాడతారు.
కథలే.. పాటలుగా
ఉమ్మడి సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడంతో పాటు.. సమాజంతో బంధం పెంచుకుంటూ ముందుకు సాగాలని బతుకమ్మ పండుగ సూచిస్తుంది. ఆనాటి సంప్రదాయాలు, కథలను యువతరానికి అందించే పండుగల్లో ఇది ఒకటి. బతుకమ్మను పూలతో తయారు చేసి.. దాని చుట్టూ చేరి.. దానికి సంబంధిచిన కథలను పాటల రూపంలో పాడుతూ.. బతుకమ్మ గురించి తెలియజేస్తారు.
నిమజ్జనం..
బతుకమ్మ.. ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుచుకుంటూ.. ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇలా బతుకమ్మను నిమజ్జనం చేసి వర్షాకాలానికి ముగింపు పలుకుతారు. శరదృతువు ప్రారంభాన్ని ఇది సూచిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ప్రతి మహిళ ఈ పండుగను వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.
Also Read : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్‌గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే