Discover the Health Benefits of Bathukamma : మహిళలు ఇంట్లో పనులు, రెగ్యూలర్ పనులు చేయడంలో బిజీగా ఉంటారు. ఇంటి పనిలో.. కుటుంబ బాధ్యతల్లో వారికి మెంటల్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. పైగా వీరికి పర్సనల్ యాక్టివిటీలంటూ ఏవి ప్రత్యేకంగా ఉండవు. అయితే బతుకుమ్మ సమయంలో వారికి స్ట్రెస్ రిలీఫ్ చేస్తూ.. ఆరోగ్యానికి బెనిఫిట్స్ అందించే యాక్టివిటీలు ఎన్నో ఉంటాయి. అవి ఎలాగో.. బతుకుమ్మ సమయంలో ఆట, పాటల వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి మంచిదట..
బతుకమ్మ సమయంలో దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉంటారు. పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా వారికి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. మెరుగైన రక్తప్రసరణను అందించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్‌ని పెంచుతుంది. గుండెకు సంబంధించిన ఇబ్బందులను దూరం చేస్తుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడడంవల్ల మంచి హార్మోన్స్ విడుదల అవుతాయి.
నిద్ర పెరుగుతుంది..
అధ్యయనాలు ఏమి చేప్తున్నాయంటే
ప్రొఫెషనల్ డ్యాన్సర్ కన్నా.. రోజూ నార్మల్‌గా డ్యాన్స్ చేసుకునేవారు హెల్తీగా ఉంటారట. డ్యాన్స్‌ని కష్టపడి చేసేవారికంటే జుంబా లాంటివి చేసిన వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం 46 శాతం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియన్ అధ్యయనంలో తేలింది. కండరాలు టోన్ అవుతాయి. మానసికంగా కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఎండార్ఫిన్స్ విడుదలై.. ఒత్తిడి తగ్గుతుంది. మెటబాలీజం పెరుగుతుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది.
మానసిక ఆందోళన తగ్గుతుంది..
ఫటిగో, ఒత్తిడి సమస్యలున్నవారు బతుకమ్మనే కాకుండా.. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మానసిక సమస్యలు దూరమై.. జ్ఞాపకశక్తికూడా మెరుగవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ తరహా యాక్టివిటీలు బరువును కంట్రోల్ చేయడంలో, ఫ్లెక్సీబులిటీని పెంచుతుంది. కండరాలకు బలం చేకూరుతుంది. యాంగ్జైటీ, ఒత్తిడి తగ్గుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. యోని కండరాలకు కూడా ఈ యాక్టివిటీలు మంచి ప్రయోజనాలు అందిస్తాయట. పాటలు రెగ్యూలర్‌గా పాడుతూ ఉంటే.. లంగ్స్ ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడి, ఆందోళన కూడా కంట్రోల్లో ఉంటుంది. మూడ్‌ని రీసెట్ చేస్తుంది.
Also Read : బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు.. స్త్రీ శక్తిని గౌరవిస్తూ, ప్రకృతితో మమేకమై చేసుకునే ఫెస్టివల్ ఇది
శారీరక, మానసిక ప్రయోజనాల కోసం..
బతుకమ్మ ఆడినా లేకున్నా రెగ్యూలర్‌గా జుంబా క్లాస్‌లు పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. పైగా మిమ్మల్ని డ్యాన్స్‌లో ప్రావీణ్యులను చేస్తుంది. యాక్టివ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బయటకు క్లాస్‌లకు వెళ్లలేనివారు ఇంట్లోనే పాటలు పాడుతూ, డ్యాన్స్ వేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే డ్యాన్సింగ్ పార్టనర్ ఒకరు తోడుగా ఉంటే మీరు కూడా ఉత్సాహంగా రోజూ ఈ చర్యలో పాల్గొంటారు. రోజుకి ఓ అరగంట మీరు దీనికి కేటాయించుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
Also Read : బతుకమ్మను ఏ విధంగా పేర్చాలో తెలుసా? ఉపయోగించాల్సిన పూలు ఇవే