Andhra Pradesh: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ లుకలుకలు బహిర్గతమయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో వెలుగు చూశాయి. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేయడమే కాకుండా దాడులకు కూడా యత్నించుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. 


రాజంపేటలో అన్న క్యాంటీన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చాలా కాలంగా ఉన్న రాజంపేట టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. 


అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసబ్రమణ్యం తన వర్గీయలతో వచ్చారు. తర్వాత అక్కడకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్ రాజు వచ్చారు. అయన రావడంతోనే వివాదం మొదలైంది. 






చివరకు పోటా పోటీగా రిబ్బన్‌ కటింగ్‌కు ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా ప్రయత్నించారు. ముందుగా అన్న క్యాంటీ ప్రారంభించాడనికి జగన్ మోహన్ యత్నించారు. అక్కడే ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం తాను కట్ చేస్తానంటూ ముందుకొచ్చారు. ఈ వాదన జరుగుతున్న టైంలోనే జగన్ మోహన్ రాజు చేతిలో ఉన్న కత్తెరను బాలసుబ్రమణ్యం లాక్కున్నారు. 


అలా కత్తెర లాక్కొని క్షణాల వ్యవధిలోనే క్యాంటిన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచిన రిబ్బన్ కట్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. దాడులకు కూడా దిగే టైంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. 


Also Read: కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !