ప్రముఖ స్వరకర్త, గాయకుడు బప్పీ లహిరి అనారోగ్యంతో మరణించారు. బుధవారం తెల్లవారుజామున ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆసుపత్రిలో నెల రోజుల పాటూ చికిత్స తీసుకున్నారు. సోమవారమే ఆసుపత్రి నుంచి  డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. ఒకరోజు తరువాత పరిస్థితి బాగోలేదంటూ వైద్యులకు ఫోన్ చేశారు బప్పీ లహిరి కుటుంబసభ్యులు. వైద్యుడు ఇంటికెళ్లి చూసి ఆరోగ్యం క్షీణించిందని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఆయన మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణాన్ని ‘అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా’గా తేల్చారు వైద్యులు.


ఏంటీ సమస్య?
అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనేది ఒక నిద్ర రుగ్మత. ఇది నిద్రలో ఒక వ్యక్తి శ్వాసక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అధికసమయం ఊపిరాడకపోతే నిద్రలోనే మరణం సంభవిస్తుంది. 







ఎందుకు కలుగుతుంది?
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కలగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి..
1. అధిక బరువు
2. వారసత్వంగా ఈ సమస్య ఉండడం
3. వయసు మీరడం వల్ల 
4. శ్వాసకోశసమస్యలు ఉండడం, వాయుమార్గం ఇరుకుగా ఉండడం, 
5. టాన్సిల్స్, అడినోయిడ్స్, నాసికా పాలిప్స్ ఉండడం 
6. వ్యాయామం చేయకపోవడం
7. అనారోగ్యకర జీవనశైలి
8. మధుమేహం, హైపర్ టెన్షన్ ఉండడం


ప్రాణాలు తీసేంత ప్రమాదమా?
ఈ సమస్య కలగడం వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు తలెత్తవచ్చు. ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 


1. ఆక్సిజన్ స్థాయిలో దారుణంగా పడిపోవడం
2. గుండె, కిడ్నీలు, మెదడు వంటివి దెబ్బతినడం
3. గుండె పోటు, హైపర్ టెన్షన్, స్ట్రోక్ వంటివి కలిగే అవకాశం ఉంది. 


లక్షణాలు
1. అతిగా అలసిపోయినట్టు అనిపించడం
2. గురక
3. రాత్రి నిద్రలో చెమటలు పట్టడం, నోరు ఎండిపోవడం, గొంతులో మంటగా అనిపించడం
4. మధ్య రాత్రిలో హఠాత్తుగా మెలకువ రావడం
5. గొంతులో ఏదో అడ్డుపడినట్టు నిద్రలోంచి హఠాత్తుగా లేవడం
6. మూడ్ స్వింగ్స్
7. తలనొప్పి
8. ఏకాగ్రత తగ్గడం
9. లైంగిక శక్తి తగ్గడం


అధిక బరువు వల్ల స్లీప్ అప్నియా సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది. బొజ్జ పెరుగుతుంటే దాన్ని తగ్గించడం చాలా అవసరం. అలాగే గురకను కూడా తేలికగా తీసుకోవద్దు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.







Also read: ప్రోటీన్లు కావాలంటే మాంసాహారంపైనే ఆధారపడక్కర్లేదు, వీటిలో కూడా పుష్కలం


Also read:  చెత్త ఏరుకునే ఈ వ్యక్తి హ్యాండ్సమ్ మోడల్‌లా ఎలా మారాడో చూడండి