Keep Bananas Fresh Longer in Summer : అరటిపండ్లు చాలామంది ఇళ్లల్లో ఉంటాయి. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. పైగా తక్కువ ఖర్చులో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఇవి కూడా ఒకటి. కాబట్టి వీటిని ఎక్కువమంది తింటారు. ఇళ్లల్లో పెట్టుకుంటారు. అయితే సమ్మర్లో వీటితో ఓ ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే.. వేసవిలో అరటిపండ్లు త్వరగా పండిపోతాయి. లేదా నల్లబడిపోతాయి. సరైన విధంగా నిల్వ చేయకపోతే కొద్ది గంటల్లోనే మెత్తబడిపోతాయి. అందుకే అరటిపండ్లు ఇంటికి తీసుకెళ్లాక కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. దీంతో అవి రోజంతా ఫ్రెష్‌గా ఉంటాయి. అవేంటో చూద్దాం.

Continues below advertisement

అరటిపండ్ల కాడ

అరటిపండు కాడ నుంచి గ్యాస్ విడుదలవుతుంది. అందుకే వాటి కాడను ప్లాస్టిక్ ర్యాప్ లేదా ఫాయిల్‌తో కవర్ చేయాలి. దీనివల్ల పండు పండడం ఆలస్యమవుతుంది. అలాగే అరటిపండ్లను కాడలు లేకుండా ఎక్కువకాలం ఉంచుకోకూడదు. 

ఇతర పండ్లతో కలిపి.. 

ఆపిల్, మామిడి వంటి పండ్లు ఎథిలీన్ గ్యాస్ విడుదల చేస్తాయి. వాటి దగ్గర అరటిపండ్లు పెడితే త్వరగా పండిపోతాయి. అందుకే మిగిలిన ఫ్రూట్స్​కి దూరంగా వీటిని ఉంచాలి. 

Continues below advertisement

హ్యాంగ్ చేస్తే.. 

అరటిపండ్లను వేలాడదీసి ఉంచితే మరీ మంచిది. ఎందుకంటే అలా చేయడం వల్ల గాలి సరిగా వెళ్తుంది. దీంతో పండు నలిగిపోవడం తగ్గుతుంది. 

ఫ్రిడ్జ్​లో పెట్టొచ్చా?

అరటిపండ్లు పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్​లో పెట్టాలి. పచ్చిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. పండిన తర్వాత ఫ్రిడ్జ్​లో పెడితే.. తొక్క నల్లబడినా లోపల ఫ్రెష్‌గా ఉంటుంది.

ప్లాస్టిక్ కవర్లో పెట్టకండి..

అరటిపండ్లు తీసుకెళ్లేందుకు చాలామంది వాటిని ప్లాస్టిక్ కవర్లో పెడతారు. వాటిని అలాగే ఉంచేస్తారు. అలా చేస్తే గాలి అందక.. తేమ పెరిగి త్వరగా పాడవుతాయి.

వేరు చేయండి..

అలాగే అరటిపండ్లను హస్తంగా కాకుంగా.. వాటిని కాడలతో పాటు విడిగా కోసి పెడితే.. పండడం అనే ప్రక్రియ కొంచెం స్లో అవుతుంది.

చల్లటి, పొడి ప్రదేశం

అరటిపండ్లు ఎండలో లేదా వేడి దగ్గర పెట్టకూడదు. కిచెన్‌లో కూల్ ప్లేస్‌లో ఉంచితే ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉంటాయి. పేపర్​లో చుట్టి పెడితే మరింత తాజాగా ఉంటాయి. 

అలాగే కట్ చేసిన అరటిపండ్లపై కొద్దిగా నిమ్మరసం రాస్తే అవి నల్లబడకుండా ఉంటాయి. అలాగే అరటిపండ్లు ఒకేసారి ఎక్కువ కొనకుండా తక్కువ, అవసరానికి తగ్గట్లు తీసుకుంటే మంచిది. ఈ సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే.. అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. దీంతో వృథా తగ్గి.. ఆరోగ్యకరమైన పండ్లను ఆస్వాదించగలుగుతారు.