Miss India Earth 2019 Sayali Surve Missing Or Kidnapped: మాజీ మిస్ ఇండియా ఎర్త్ (2019) విజేత, అందాల భామ సయాలీ సుర్వే కనిపించడం లేదు. ఆమెతో పాటు నలుగురు సంతానం కూడా అదృశ్యం అయ్యారు. ప్రస్తుతం సయాలీ సర్వే మిస్సింగ్ చర్చనీయాంశంగా మారింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి, మళ్ళీ హిందుత్వలోకి ఆమె మారడం, అదృశ్యం వెనుక పలు ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
ముస్లింతో ప్రేమ... పెళ్లి కోసం ఇస్లాంలోకి!వ్యాపారవేత్త ఆతిఫ్ తాసేతో కొన్ని ఏళ్ల క్రితం సయాలీ సుర్వే ప్రేమలో పడ్డారు. ఆ వ్యక్తితో వివాహం కోసం మతం మార్చుకున్నారు. పెళ్లి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించడమే కాదు... తన పేరును అతీజాగా మార్చుకున్నారు.
వివాహమైన కొన్ని రోజుల పాటు ఆతిఫ్, అతీజా దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ఆ ముచ్చట ఎన్నాళ్లో గడవలేదు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే తనకు భర్త నుంచి వేధింపులు ఎదురయ్యాయని, తనను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని అతీజా అలియాస్ సయాలీ సర్వే ఆరోపణలు చేశారు.
ఇస్లాం నుంచి మళ్ళీ హిందుత్వలోకి!భర్త వేధింపుల వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటీవల తన నలుగురు పిల్లలతో కలిసి అత్తింటి నుంచి బయటకు వచ్చారు సయాలీ సర్వే. మళ్ళీ హిందూ మతంలోకి ఆమె మారారు. అతీజా నుంచి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు.
Also Read: Priyanka Chopra Photo Gallery: బికినీలో ప్రియాంక... 'వారణాసి' కోసం హైదరాబాద్ సిటీలో!
హిందూ మతంలోకి మారిన కొన్ని రోజులకు... మహారాష్ట్రలోని పుణెలో గల పింప్రి చించ్వాడ్‌లో నలుగురు పిల్లలతో సహా సయాలీ సర్వే అదృశ్యం అయ్యారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను ఆమె భర్త, అత్తింటికి సంబంధించిన వ్యక్తులే కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పింప్రి చించ్వాడ్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. హిందూ మతంలోకి మారిన కొద్ది రోజులకే సయాలీ సర్వే మిస్ కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Also Read: Peddi: 'పెద్ది' వాయిదా పక్కా - మరి విడుదల జూన్ మొదటి వారంలోనా? లేదంటే...
