Peddi New Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా 'పెద్ది' విడుదల ఎప్పుడు? అని ప్రశ్నిస్తే... ఏప్రిల్ 30న అని ఆన్సర్ వస్తుంది. అయితే... 'చెన్నై లవ్ స్టోరీ'లోని పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ వాయిదా పడుతుందని చెప్పారు. దాంతో ఆయన మీద మెగా అభిమానులు విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దాంతో వివరణ ఇవ్వవలసి వచ్చింది. కట్ చేస్తే.. 'రాకాస' టీంతో 'పెద్ది' లేట్ అవ్వదని చెప్పమని స్వయంగా రామ్ చరణ్ చెప్పారు. కానీ, పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

Continues below advertisement

జూన్ మొదటి వారమా? చివరిలోనా?Peddi Release On June 2026: ఏప్రిల్ 30న 'పెద్ది' విడుదల అయ్యే అవకాశాలు లేవని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. మరి, సినిమా ఎప్పుడు వస్తుంది? అంటే... జూన్ నెలలో అనే సమాధానం వినబడుతోంది.

Also Read: Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు ఫిక్స్‌, కానీ ట్విస్ట్

Continues below advertisement

ప్రస్తుతానికి 'పెద్ది' సినిమా యూనిట్ రెండు ఆప్షన్స్ చూస్తోంది. ఒకటి... జూన్ తొలి వారంలో 4వ తేదీ. మరొకటి... జూన్ ఆఖరి వారంలో 24వ తేదీ. ఈ రెండు తేదీల్లో ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? అనేది త్వరలో తెలుస్తుంది. అందుకు తగ్గట్టు ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేయనున్నారు. ప్రస్తుతం 'పెద్ది' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ సిటీలో రామ్ చరణ్ పాల్గొనగా... కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

Also ReadTrisha: త్రిష ప్రేమ పలుకులు... విజయ్ కోసమా? సంగీతకు కౌంటరా?

రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, లెజెండరీ టాలీవుడ్ నటుడు జగపతి బాబు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'చికిరి చికిరి...', 'రై రై రారా' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రమిది.

Also ReadTN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్