Trisha Latest News In Telugu: త్రిష ప్రేమలో ఉన్నారని తమిళ ప్రజలు బలంగా చెబుతున్నారు. ఆమె ప్రేమ వ్యవహారం రాజకీయాల్లో పెను తుఫానుకు కారణం అవుతోందని విశ్లేషకులు చెప్పే మాట. దళపతి విజయ్, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని... విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరడానికి కారణం త్రిష అని ప్రచారం జరుగుతోంది. తమ మధ్య ప్రేమ ఉందని ఇటు త్రిష గానీ, అటు విజయ్ గానీ చెప్పలేదు. విడాకుల కోసం సంగీత కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత త్రిషతో కలిసి ఓ పెళ్ళికి విజయ్ హాజరు కావడంతో వాళ్ళ మధ్య ఏదో ఉందని మరింత బలంగా పుకార్లు వినిపించడం మొదలైంది. ఈ తరుణంలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో త్రిష షేర్ చేసిన ఓ కొటేషన్ డిస్కషన్ పాయింట్ అవుతోంది. 

ప్రేమ గురించి త్రిష పలుకులుLove is not everything and yet everything is meaningless without love - ఇదీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో త్రిష షేర్ చేసిన ఫోటోలో ఉన్నది. అంటే... 'ప్రేమ ఒక్కటే సర్వస్వం కాదు. అయితే... ప్రేమ లేని ప్రతి అంశం అర్థరహితమే' అని అర్థం. విజయ్ మనసులో సంగీత అంటే ప్రేమ లేదు కనుక వాళ్ళ బంధాన్ని అర్థరహితం అని పరోక్షంగా చెప్పారా? లేదంటే విజయ్, తనకు మధ్య ఉన్న బంధం గురించి ఏమైనా చెప్పాలని భావిస్తున్నారా? అనేది సస్పెన్స్. 

Also Read: Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు ఫిక్స్‌ కానీ ట్విస్ట్ ఉంది గురూ

విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లిన సంగీత... తన భర్తకు ఓ నటితో సంబంధం ఉందని చెప్పడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందని రాజకీయ నాయకులు సైతం విమర్శలు చేస్తుండటంతో విడాకులు వార్తలు హైలైట్ అవుతున్నాయి. ఏప్రిల్ 20న ఆ కేసు కోర్టులో విచారణకు రానుంది.

Also ReadTN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్

విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ ముందుకు వెళుతున్నారు త్రిష. మరోవైపు విజయ్ రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పరోక్షంగా విడాకులు పట్టించుకోవద్దని అభిమానులకు, టీవీకే పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

Also ReadSuriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!