'కపుల్ ఫ్రెండ్లీ'తో యువ కథానాయకుడు సంతోష్ శోభన్ (Santosh Sobhan) మాంచి విజయం అందుకున్నారు. ఆయనకు అదొక మెమరబుల్ హిట్. తెలుగుతో పాటు ఆ సినిమా తమిళనాడులోనూ మంచి విజయం సాధించింది. తెలుగునాట వసూళ్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ సాధించింది. 'కపుల్ ఫ్రెండ్లీ' విజయం తర్వాత మరో సినిమా స్టార్ట్ చేశారు సంతోష్ శోభన్. అదే 'సత్తిబాబు పరలోక యాత్ర' (Sattibabu Paraloka Yatra Movie). ఆ సినిమా వివరాల్లోకి వెళితే... 

జూన్ నుంచి 'సత్తిబాబు పరలోక యాత్ర'యువ కథానాయకుడు సంతోష్ శోభన్, యూవీ క్రియేషన్స్ సంస్థది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'కపుల్ ఫ్రెండ్లీ' నిర్మాతల్లోనూ యూవీ సంస్థ ఉంది. వాళ్ళ కలయికలో అది నాలుగో సినిమా. ఇప్పుడు 'సత్తిబాబు పరలోక యాత్ర' ఐదో సినిమా.

Also ReadVanda Devullu Teaser: ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలా? విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు' టీజర్ చూశారా?

యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ సంస్థ 'సత్తిబాబు పరలోక యాత్ర' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. 'స్వాతిముత్యం' ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మక సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్ మొదటి వారం నుంచి మొదలు కానుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివాదాలు వెల్లడి కానున్నాయి.

Also ReadTN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్