కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చేయడం ఒక మెమరబుల్ మూమెంట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి చేసే సినిమాలకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా పని చేస్తారు. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య 'సీతా పయనం' చేశారు. ఆ తరహాలో మరో సినిమా రాబోతోంది. తల్లి దర్శకత్వంలో తనయుడు సినిమా చేస్తున్నారు. అదే 'రాయవలస'. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
కార్తీక్ తొలి సినిమాకు తల్లే దర్శకురాలు!తెలుగు చిత్రసీమకు కార్తీక్ జయంతి (Karthik Jayanthi) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'రాయవలస' (Rayavalasa Movie). రాయ్‌సన్ ప్రొడక్షన్స్ సంస్థపై రూపొందుతున్న మొదటి చిత్రమిది. ఈ చిత్రానికి కార్తీక్ తల్లి రాధికా జయంతి దర్శకురాలు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Also Read: TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
'రాయవలస' చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ రాధిక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. పల్లెటూరి నేపథ్యంలో చక్కటి కథతో సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన కార్తీక్ ఫస్ట్ లుక్ మంచి స్పందన అందుకోవడం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు. అమెరికాలో పెరిగిన కార్తీక్, చిన్నతనం నుంచి తెలుగు సినిమాలపై ఇష్టంతో ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కలలు కన్నాడు. గాయకుడిగా కొన్ని వేదికలపై పెరఫార్మన్స్‌లు ఇచ్చారు. అలాగే... వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించారు. కార్తీక్ నటుడు మాత్రమే కాదు... రైటర్, లిరిసిస్ట్, డ్యాన్సర్ కూడా!
అసలు రాయవలస కథ ఏమిటి?వాస్తవ ఘటనల ఆధారంగా 'రాయవలస' చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెప్పారు. కథ విషయానికి వస్తే... రాజు, రైస్ మిల్ యజమాని. అతని జీవితం చుట్టూ తిరుగుతుందీ కథ. కుటుంబం, స్నేహితులతో సరదాగా సాగుతున్న అతని జీవితం... ఓ అమ్మాయి ప్రవేశం తర్వాత అనూహ్య మలుపులు తీసుకుని ముందుకు వెళుతుంది. ఎమోషన్స్, యాక్షన్, సంగీతం మేళవించి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.
Also Read: Suriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!
కార్తీక్ జయంతి సరసన శ్రీషా నూలు నటించిన 'రాయవలస'లో అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - మాటలు: రాఖీ ఏ, ఛాయాగ్రహణం: వీఆర్కే నాయుడు (కిట్టు),సంగీతం: అర్జున్ బాలా (కెనడా), సాహిత్యం: పూర్ణ చారి - కార్తీక్ జయంతి - తరుణ్ సైదులు, గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ - ధనుంజయ్ - రోహిత్ పరిటాల - రమ్య బెహరా - సాహితి చాగంటి - సౌజన్య భాగవతుల - వాగ్దేవి - అర్జున్ - కార్తీక్ జయంతి, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రాధిక జయంతి, నిర్మాత: గోపీ కృష్ణ జే.
