MeghasandesamSerial Today Episode: స్టేషన్‌లో ఉన్న చెర్రిని కలవడానికి భూమి, కేపీ వెళ్తారు. అక్కడే ఎస్సైగా డీమోట్‌ అయిన సూర్య ఉంటాడు. వాళ్లను చూసి మీరేంటి స్టేషన్‌ వచ్చారు. మీకు ఇక్కడేం పని అని అడుగుతాడు.

Continues below advertisement

భూమి: చెర్రిని కలవడానికి వచ్చాము..

సూర్య: మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేమీ గెస్ట్‌ హౌస్‌ కాదు. రేప్‌ కేసులో అక్యూజ్డ్‌ వాడు ఎఫ్‌ఐఆర్‌ కూడా పైల్‌ అయింది. ఆడపిల్లలు అంటే ఆటబొమ్మలు అనుకుంటున్నాడా వాడు. ఇప్పుడు కలవడం కుదరదు వెల్లండి..

Continues below advertisement

కేపీ: సార్‌ వాడితో మాట్లాడకుండా మేము వెనక్కి వెల్లం..

సూర్య: నాకు లోపల వేయడమే కాదు బయటకు పంపించడం కూడా తెలుసు.

భూమి: ఏంటి బెదిరిస్తున్నారా..? నిన్ను ఈ స్టేషన్‌లో చూడగానే.. చెర్రిని అరెస్ట్‌ చేయడంలో ఉన్న కుట్ర ఏంటో అర్తం అయింది. నీతో పాటు నీ వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు. మర్యాదగా చెర్రితో మాట్లాడటానికి ఒప్పుకోకపోతే నేను మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది.

కానిస్టేబుల్‌: ఒకప్పుడు ఆవిడ ఆ ఫోన్‌ వాడితేనే మీ ఉద్యోగం ఊడింది. మళ్లీ ఆ సీన్‌ రిపీట్‌ అవ్వడం అవసరమా..?

సూర్య: సరే మాట్లాడటానికి పర్మిషన్‌ ఇస్తాను. కానీ మీ ఫోన్స్‌ మాత్రం అక్కడ పెట్టేసి వెల్లండి

అని చెప్పగానే.. భూమి, కేపీ తమ ఫోన్లు టేబుల్‌ మీద పెట్టి లోపలికి చెర్రి దగ్గరకు వెళ్తారు.

కేపీ: చెర్రి అసలు ఏంట్రా ఇది అసలు ఏం అయింది.

చెర్రి: అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు నాన్న. నేను ఏ తప్పు చేయలేదు.

భూమి: చెర్రి నిన్ను బయటకు తీసుకెళ్లడానికే వచ్చాం. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు చెర్రి.

చెర్రి: భూమి నేను నక్షత్రకు క్లోజ్‌ అవ్వడానికి మాత్రమే లిల్లికి దగ్గర అయినట్టు నటించాను. కానీ తను కూడా నాతో ఫ్రెండ్లీగా మూవ్‌ అయింది. గెస్ట్‌ హౌస్‌ దగ్గరకు వెళ్లగానే.. ఒక్కసారిగా తన బిహేవియర్‌ మారిపోయింది. ఒక్కసారిగా తనే నా మీదకు వచ్చేసి తన బట్టలు తానే చించుకుని గట్టిగా హెల్ప్‌ అని అరిచేసింది. అప్పుడే ఈ సూర్య వచ్చాడు. నేను ఎంత చెప్తున్నా నన్ను అరెస్ట్‌ చేశాడు.

భూమి: నాకు అర్తం అయింది చెర్రి. ఇదంతా ఆ అపూర్వ ప్లాన్‌.

కేపీ: భూమి వీడు అపూర్వకు అల్లుడు వీడిని ఎందుకు అరెస్ట్‌ చేయించింది.

భూమి: నక్షత్రని చెర్రిని విడదీయడమే ఈ ప్లాన్‌ వెనక ఉన్న ఉద్దేశం మామయ్య. ఇప్పుడు లిల్లీని వాడుకుని నక్షత్రకు చెర్రికి విడాకులు ఇప్పించాలని చూస్తుంది. అందుకే సూర్యకు మళ్లీ జాబ్‌ వచ్చేలా చేసి వీళ్లు గెస్ట్‌ హౌస్‌కు వెళ్లే టైంకి సూర్యకు సమాచారం ఇచ్చి సూర్య చేత చెర్రిని అరెస్ట్ చేయించింది. చెర్రి ఈ కేసు ఫ్రూవ్‌ అయితే నీకు మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు నీకు నక్షత్రకు విడాకులు ఇప్పించొచ్చు అని ఆవిడ ప్లాన్‌.

కేపీ: ఎందుకమ్మా మాకే ఇలా జరుగుతుంది. అయినా నా పిల్లలకు ఈ శిక్ష ఎందుకు..?

చెర్రి: నాన్న ఫ్లీజ్‌ నాన్న మీరు బాధపడకండి. మీరు బాధపడితే వద్దు నాన్న.

భూమి: మామయ్య మీరు ఇలా బాధపడితే చెర్రి ఇంకా భయపడతాడు.

కేపీ: ఆ అపూర్వను నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా భార్యబిడ్డలను కోల్పోయాను. ఆరోజు నుంచి ఈ రోజు దాకా నేను అసలు ప్రశాంతంగా బతకడం లేదమ్మా..? అసలు నాకు ఈ జీవితం అవసరమా అనిపిస్తుంది.

అంటూ కేపీ బాధపడుతుంటే.. భూమి, చెర్రి షాక్‌ అవుతారు. కేపీని ఓదారుస్తారు. మనకు కూడా మంచిరోజులు వస్తాయని భూమి ధైర్యం చెప్తుంది. చెర్రికి ఏమీ కాదని భరోసా ఇస్తుంది. లిల్లీని కలిసి నిజం బయటకు తీసుకొస్తాను అంటూ చెప్పగానే.. అది అపూర్వ జరగనివ్వదు అంటూ చెర్రి బాధపడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!