టీ కంటే ఎక్కువ మంది ఇష్టపడేది కాఫీని. చాలా మంది కాఫీ ప్రియులు దానికి సంబంధించిన తాజా రుచులు, ట్రెండ్స్ గురించి సెర్చ్ చేసి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే బనానా కాఫీ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇప్పుడు ఇది ఎక్కువ మంది తెగ ఫాలో అయిపోతున్నారు. పాస్తా చిప్స్ నుంచి క్లౌడ్ బ్రేడం బేక్డ్ వోట్స్, పింక్ సాస్, బటర్ బోర్డ్ వంటి అనేక రకాల కొత్త వంటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయినవే. ఇప్పుడు ఈ జాబితాలోకి బనానా కాఫీ వచ్చి చేరింది.


బనానా కాఫీ అంటే ఏంటి?


ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. వెరైటీ పదార్థాలు మిక్స్ చేసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవి రుచిగా ఉండే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వెంటనే వైరల్ గా మారిపోతుంది. దాని ఫాలో అయిపోతున్నారు. అలాంటిడే ఈ బనానా కాఫీ. పాలు లేకుండా తయారు చేయబడే పానీయం ఇది. దీని కోసం ఎన్నో పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలతో సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ చేసిన అరటిపండు, తాజాగా తయారు చేసిన బ్లాక్ కాఫీ ఉంటే చాలు.


అరటి కాఫీ ప్రయోజనాలు


ఈ కాఫీ రుచికరంగా మాత్రమే కాదు పోషకాలతో నిండి ఉంటుంది. అరటిపండులో డైటరీ పైబర్ తో పాటు మల్టిపుల్ మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. తీపి, క్రీమ్ రుచిగా ఉండటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.


ఈ కాఫీ ఎలా తయారు చేయాలి?


జనాదరణ పొందిన ఈ బనానా కాఫీని తయారు చేయడానికి కావలసిందల్లా రెండు ఫ్రొజెన్ అరటిపండ్లు, ఒక కప్పు కోల్డ్ డ్రిప్ కాఫీ. మీరు చేయాల్సిందల్లా ఈ కాఫీలో అరటిపండ్లు బాగా కరిగే వరకు కలపాలి. పండిన అరటిపండ్లు చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి మీరు అందులో వేరే స్వీటేనర్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కోల్డ్ డ్రిప్ కాఫీకి బదులుగా ఒక కప్పు కోల్డ్ బ్రూ కాఫీ కూడా ఉపయోగించుకోవచ్చు.


టెస్ట్ అదుర్స్


అరటి కాఫీ రుచిని మరింత మెరుగు పరుచుకోవాలనుకుంటే మీరు అందులో కాసింత వెనీలా ఎక్స్ ట్రాక్ట్, నట్ బటర్, దాల్చిన చెక్క, జాజికాయ, కోకో పౌడర్ వంటి కొన్ని రుచికరమైన పదార్థాలు జోడించుకోవచ్చు. చాక్లెట్ రుచిని మీరు ఇష్టపడే వాళ్లయితే అందులో కాస్తా చాక్లెట్ సిరప్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ న్యూ ట్రెండ్ బనానా కాఫీ ట్రై చేసి చూడండి. అరటిపండు కలపడం వల్ల ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే