చర్మం, మెదడుతో సహ శరీరంలోని ఎక్కువ భాగం కొవ్వుతో తయారవుతుంది. అంతే కాదు మనం తినే కొవ్వుల నాణ్యత మీద వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. శరీరానికి కొంతమేర కొవ్వు అవసరమే. అన్ని కొవ్వులు ఒకేలా ఉండవు. సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు శరీరానికి హానికరం. అయితే PUFA, MUFA, ఒమేగా 3 వంటి అసంతృప్త కొవ్వులు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. కొవ్వులో కరిగే విటమిన్ల శోషణ, తక్షణ శక్తిని అందించేందుకు, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి వాటిని తగ్గించడంలో మంచి కొవ్వులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని ఆహారంలో చేర్ఛవలసిన కొవ్వులు ఉన్నాయి. ఇవి మీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


నూనెలు 


మీ ప్రాంతానికి చెందిన నూనెలు ఉపయోగించాలి. ఉత్తర, ఈశాన్య భారతదేశంలో ఆవాలు, పశ్చిమ ప్రాంతాల్లో వేరుశెనగ, టిల్, కేరళలో కొబ్బరి లభిస్తాయి. స్థానికంగా దొరికే వంట నూనెల్లో కొవ్వు ఆమ్లాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వాటిని తినేందుకు ఉత్తమమైనవి గా పరిగణిస్తారు. గుండె ఆరోగ్యం కోసం శుద్ధి చేసిన కూరగాయలు, బియ్యం ఊక, కుసుమ పువ్వు వంటి నూనెల జోలికి వెళ్లకపోవడమే మంచిది. నూనెని తక్కువ ఉష్ణోగ్రత వద్ద తీస్తారు. వీటిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ప్రీ డయాబెటిస్, డయాబెటిక్, కొలెస్ట్రాల్, బరువుని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ మంచిది. అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఎటువంటి నూనె అయినా కూడా కొద్దిగా వేసి వండుకున్నప్పుడే ఆరోగ్యానికి మంచిది.


కొబ్బరి నూనె


పేగులని ఆరోగ్యంగా ఉంచి నరాలను ప్రశాంతంగా ఉంచడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది. జీర్ణక్రియకి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, గుణాలు ఉన్నాయి. కొబ్బరి లడ్డూలు, బర్ఫీలుగా చేసుకుని తినొచ్చు. మలాయ్, బెల్లం, వేరుశెనగ పొడితో కలిపి తీసుకోవచ్చు.


కొబ్బరి వల్ల ప్రయోజనాలు


☀ అధిక ఫైబర్ ఉంటుంది


☀ సంతృప్తి అనుభూతి ఇస్తుంది


☀ ఎముకలు, కండరాలకు అవసరమైన మాంగనీస్ లభిస్తుంది


☀ సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్


☀ విటమిన్ బి, ప్రోటీన్లు అందుతాయి


☀ జీవక్రియను పెంచుతుంది


జీడిపప్పు తినాలి


ఇందులో ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సెరోటోనిన్ ఉత్పత్తిలో సహాయపదటిఐ. సహజమైన స్లీపింగ్ పిల్. ఇందులోని మెగ్నీషియం నరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఇందులోని ట్రిప్టోఫాన్, విటమిన్ B సహజమైన యాంటీ డిప్రెసెంట్ గా పని చేస్తుంది. నిద్రని ప్రేరేపిస్తుంది. మధ్యాహ్న భోజన సమయంలో లేదా రాత్రి పాలతో పాటు జీడిపప్పు తీసుకుంటే మంచిది. ఇందులోని ఫైబర్ తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి. లేదంటే అదనపు కొవ్వు శరీరంలో చేరిపోతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?