Operation Amritpal: పారిపోయిన ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్‌ను అరెస్టు చేసేందుకు మార్చి 18వ తేదీ నుంచి కేంద్ర భద్రతా సంస్థలు, పంజాబ్ పోలీసులు ఆపరేషన్ అమృత్ పాల్‌ను ప్రారంభించారు. అయితే రెండు వారాలు గడుస్తున్నా అమృత్ పాల్ జాడ పోలీసులకు చిక్కలేదు. అయితే బైసాఖికి ముందు రానున్న రోజుల్లో అమృత్ పాల్ సింగ్ అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలోని అకల్ తఖ్త్ ముందు లొంగిపోవచ్చని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం.. అమృత్ సర్‌లో పోలీసులకు లొంగిపోవడంలో ఏదైనా సమస్య ఉంటే.. భటిండాలోని దామ్‌దామా సాహిబ్ లేదా ఆనంద్‌పూర్ సాహిబ్ జిల్లాలోని శ్రీ కేష్‌ఘర్ సాహిబ్ ముందు లొంగిపోవాలనే ఆలోచనలో అమృత్ పాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు, భద్రతా సంస్థలు ఈ మూడు చోట్ల ప్రాంతాన్ని కంటోన్మెంట్‌గా మార్చాయి. అమృత్ పాల్ లొంగిపోయే లోపే అతడిని పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అమృత్‌పాల్ తన సహచరుల సాయంతో గత 48 గంటలుగా అమృత్ సర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
పోలీసులకు సవాల్ విసురుతూ అమృత్ పాల్ వీడియో విడుదల
పరారీలో ఉన్న తనను అరెస్ట్ చేయాలని పోలీసులకు, భద్రతా సంస్థలకు సవాలు చేస్తూ అమృత్ పాల్ సింగ్ గురువారం వీడియోను విడుదల చేశాడు. ఇందులో తాను పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని చెప్పాడు. ఈ వీడియో క్లిప్‌లో.. అతడు తాను లొంగిపోవట్లేదని తెలిపాడు. తాను పరారీలో ఉన్నానని, తన సహచరులను విడిచిపె ట్టానని భావించే వారు.. ఈ భ్రమ నుంచి బయటకు రావాలని అన్నారు. తాను చావుకు భయపడనని వివరించారు.
సర్బత్ ఖల్సాను సమావేశపరచాలంటూ ఆదేశం
సోషల్ మీడియా వేధికగా విడుదల చేసిన ఈ వీడియోలో సిక్కుల జతేదార్ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి సర్బత్ ఖల్సాను సమావేశపరచాలని కోరారు. ఈ వీడియో విడుదలకు ఒకరోజు ముందు ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్ పాల్ ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇందులో సిక్కుల అత్యున్నత సంస్థ అయిన జతేదార్‌ను కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఒక సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వీడియో క్లిప్‌లో కూడా సమస్య తన అరెస్టు మాత్రమే కాదని.. సిక్కు సమాజానికి సంబంధించిన సమస్యగా వాదించే ప్రయత్నం చేశాడు.
అమృతపాల్‌ను పట్టుకునేందుకు కొనసాగుతున్న అన్వేషణ
అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు పంజాబ్ పోలీసులు హోషియార్‌పూర్ గ్రామం, అనేక సమీప ప్రాంతాలలో ఆపరేషన్‌ను ప్రారంభించారు. పోలీసులు కూడా ఇంటింటికీ గాలింపు చర్యలు చేపట్టినా ఇంత వరకు ఫలితం లేకపోయింది. పంజాబ్ పోలీసులు మార్చి 18వ తేదీ నుంచి వారిస్ పంజాబ్ డి సంస్థ సభ్యులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు.
మరోవైపు అమృత్ పాల్ సింగ్...పాకిస్థాన్‌కు పారిపోవడం బెటర్ అని లోక్‌సభ ఎంపీ, శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సిమర్జిత్ సింగ్ మాన్ సూచించారు. ఆయన పోలీసులకు లొంగిపోకూడదని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
"1984లో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన సమయంలో చాలా మంది పాకిస్థాన్‌కు వెళ్లారు. అయినా అమృత్ పాల్ సింగ్‌కు నేపాల్ వెళ్లాల్సిన అవసరం ఏముంది..? పక్కనే పాకిస్థాన్ ఉందిగా. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం ఉంది"