ఒకప్పుడు నెయ్యి లేనిదే భోజనం పూర్తయ్యేది కాదు. కానీ ఇప్పుడు నెయ్యికి చివరి స్థానం. బరువు పెరుగుతామేమోనన్న భయంతో దానికి ఆహారంలో స్థానమే కల్పించడం లేదు చాలా మంది. కానీ నెయ్యి మన శరీరానికి చాలా అవసరం. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. కచ్చితంగా రోజూ స్పూను నెయ్యి తినమని సిఫారసు చేస్తుంది. అది కూడా ఉదయం పడుకుని లేచిన వెంటనే ఖాళీ పొట్టతో స్పూను నెయ్యి తినమని చెబుతోంది ఆయుర్వేదం. ఎందుకు?


పాలతో చేసే నెయ్యిలో ఎన్నో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు ఉంటాయి. దీన్ని ఉదయానే ఖాళీపొట్టతో తినడం వల్ల శరీరంలోని కణాల్లో పునరుజ్జీవాన్ని నింపుతుంది. జీర్ణప్రక్రియలో చిన్న పేగుల్లోని పోషకాల శోషణను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జీర్ణశాయంతర ప్రేగు)లోని ఆమ్ల pH స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  నెయ్యి, పసుపు కలిపి తినడంవల్ల శరీరంలోని ప్రమాదకర ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి వస్తుంది. ఫ్రీరాడికల్స్ వల్ల దెబ్బతిన్న కణాలను తిరిగి పునరుత్పత్తి చేయడంలో ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది. 


కొవ్వు భయం లేదు
ఆయుర్వేద నిపుణుల చెబుతున్న దాని ప్రకారం ఉదయం రోజూ స్పూను నెయ్యిని తాగడం వల్ల శరీరంలోని కణాలకు పోషణనిస్తుంది. కణాల డ్యామేజ్‌ని రివర్స్ చేయడంలో సహాయపడుతుంది. నెయ్యిలో బ్యూట్రిక్ ఆమ్లం, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వల్ల మొండిగా పేరుకున్న కొవ్వును బయటికి పంపించేందుకు సాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ కొలెస్ట్రాల్ గుండెకు చాలా అవసరం. 


నెయ్యిని ఎలా తాగాలి?
ఉదయం ఖాళీ పొట్టతో గోరు వెచ్చని నీటిలో, స్పూను నెయ్యిని కలపాలి. ఇది శరీరంలో  టానిక్‌లా పనిచేస్తుంది. ప్రమాదకరమైన టాక్సిన్లను బయటకు పంపేందుకు మేలు చేస్తుంది. నెయ్యిలో కాల్షియం, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించేందుకు నెయ్యి, నీటి మిశ్రమం సాయపడుతుంది. రోగినిరోధక శక్తిని పెంచుతుంది. గొంతునొప్పి, జలుబు, దగ్గు, జ్వరానికి ఈ మిశ్రమం ఔషధంలా పనిచేస్తుంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: టమాటోలు అధికంగా తింటున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు రావచ్చు


Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో


Also read: పిల్లలకు నచ్చే స్నాక్ క్రిస్పీ కార్న్, చేయడం ఎంతో సులువు