క్రిస్పీ కార్న్ రెస్టారెంట్లలో అధికంగా లభిస్తుంది. పిల్లలకు ఎంతో నచ్చే స్నాక్ ఇది. ఇలాంటి చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. నిజానికి ఇంట్లోనే సులువుగా చేసేసుకోవచ్చు. ఎలాగో చూడండి. 

కావాల్సిన పదార్థాలుస్వీట్ కార్న్ గింజలు - రెండు కప్పులుఉల్లి తరుగు - పావు కప్పుక్యాప్సికమ్ తరుగు - పావు కప్పుకార్న్ ఫ్లోర్ - పావు కప్పుమిరియాల పొడి - ఒక స్పూనువరిపిండి - పావు కప్పుకొత్తిమీర తరుగు - రెండు స్పూన్లుకారం - అరస్పూనుఉప్పు - రుచికి సరిపడానూనె - వేయించడానికి సరిపడానీళ్లు - సరపడినన్ని

తయారీ1. స్వీట్ కార్న్ గింజలు ఉడికించి పెట్టుకోవాలి. 2. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, వరిపిండి వేసి అందులో ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. 3. రుచికి సరిపడా ఉప్పు, కాస్త నీళ్లు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు. గింజలకి కార్న్ ఫ్లోర్, వరిపిండి మిశ్రమం అతుక్కునేలా చేసేంత నీరు చాలు. 4. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వెడెక్కాక స్వీట్ కార్న్ గింజల్ని వేయించాలి. 5. వేగిన గింజల్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. 6. ఇప్పుడు మిరియాల పొడి, కారం, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, కొత్తిమీర తరుగు వేసి కిందకి పైకి బాగా కదపాలి. అవసరమైతే ఉప్పు కూడా కలుపుకోవాలి. అంతే క్రిస్పీకార్న్ సిద్ధమైనట్టే. 

ఎంతో ఆరోగ్యం కూడా...1. స్వీట్ కార్న్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దరి చేరనివ్వదు. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను అధికంగా శరీరంలో చేరనివ్వదు. 2. డయాబెటిస్ ఉన్న వారు కూడా స్వీట్ కార్న్ తినవచ్చు. ఆ సమస్యను అధిగమించేందుకు స్వీట్ కార్న్ సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు స్వీట్ కార్న్ ను మెనూలో చేర్చుకోవాలి. అయితే మితంగానే తినాలి.3. స్వీట్ కార్న్ లో ఫినోలిక్ ఫ్లేవనాయిడ్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు సహకరిస్తాయి. 4. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మొక్కజొన్న ముందుంటుంది. ఈ గింజల్లో థియామిన్, విటమిన్ బి6, ఇనుము, విటమిన్ ఎ, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.పిల్లలకు పెడితే చాలా మేలు. కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని ఇవి అందిస్తాయి.  

Also read: ఉలవచారు ఎలా చెయ్యాలో తెలుసా? వారానికోసారి తిన్నా బోలెడంత శక్తి

Also read: సొరకాయ దోశ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇలా చేసుకోండి, టేస్టు అదిరిపోతుంది

Also read: మధుమేహులకు బెస్ట్ ఫుడ్ కొర్రల కిచిడీ, వారానికోసారి తిన్నా ఎంతో ఆరోగ్యం