బహుముఖ ప్రయోజనాలు అందించే వాటిలో గుడ్లు ఒకటి. ఆమ్లెట్, కూర, ఎగ్ బుజ్జీ, ఉడికించిన గుడ్లు ఇలా ఏది తిన్నా రుచికరంగానే ఉంటుంది. కానీ ఉడికించిన తర్వాత గుడ్లు రుచి, ఆకృతి మారిపోయిన సందర్భాలు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎదురవుతూనే ఉంటుంది. అలా ఎందుకు జరిగిందోనని ఆలోచించరు. గుడ్లు చెడిపోయి ఉంటాయి అందుకే అలా అయిపోయిందని అనుకుంటారు. కానీ గుడ్లు వండేటప్పుడు చేసే తప్పుల మూలంగా అది జరుగుతుంది. అందుకే ఎగ్స్ వండేటప్పుడు ఈ సాధారణ తప్పులు నివారించాలి.


అతిగా ఉడికించడం


అతిగా ఉడికించడం వల్ల ఏదైనా ఆహారం రుచి, ఆకృతి మారిపోతాయి. అది గుడ్లు వండేటప్పుడు సర్వ సాధారణంగా జరుగుతుంది. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత వాటిని అలాగే వేడి నీటిలో వదిలేయడం వల్ల అందులోని తెల్లసొన పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే గుడ్డు ఉడికిందని అనిపించిన తర్వాత వాటిని వేడి నీటిలో వదిలేయకుండా తీసి చల్లని నీటిలో పెట్టాలి.


పాన్ ప్రీహీట్ చేయకపోయినా..


కొంతమంది ముందుగా పాన్ పెట్టేసి వేడి చేయకుండానే గుడ్డు పగలగొట్టి దాని మీద వేసేస్తారు. కానీ అలా చేయడం వల్ల మీ కూర మీరే నాశనం చేసుకున్నట్టు. పాన్ ని ముందుగా వేడి చేయకుండా గుడ్డు వేస్తే అది దాని రుచి, ఆకృతిని చెడగొడుతుంది. అందుకే ఎగ్ బుజ్జీ లేదా వేపుడు వంటివి చేసేటప్పుడు తప్పనిసరిగా ముందుగా పాన్ ని వేడి చేసుకోవాలి. అప్పుడే గుడ్డు వేసిన వెంటనే అతుక్కోకుండా చేస్తుంది. చేసిన వంట రుచి అద్భుతంగా ఉంటుంది.  


అధిక వేడి వద్దు


ఆమ్లెట్ లేదా ఎగ్ బుజ్జీ చేసేటప్పుడు స్టవ్ మంట తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధిక వేడి ఉపయోగించడం వల్ల గుడ్లు ఎక్కువగా ఉడికి గట్టిగా, పొడిగా మారిపోతాయి. అందుకే ఎక్కువ మీడియం ఫ్లేమ్ మీద వంట చేయాలి. అలా చేయడం వల్ల గుడ్డు గట్టిగా మారకుండా రుచిగా మంచి ఆకృతిలో కనిపిస్తుంది.


మరిగే నీటిలో గుడ్లు వేయొద్దు


గుడ్లు బాయిల్ చేసే ముందు నీటిని బాగా వేడి చేసి అవి మరుగుతున్నప్పుడు వాటిని వేయకూడదు. ముందుగానే నీటిలో వాటిని వేసుకుని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత గుడ్లు తీసి చల్లని నీటిలో వేసుకోవాలి. లేదంటే గుడ్లు గట్టిగా ఆయిపోతాయి.


సరైన పాత్ర


గుడ్లు వండటానికి సరైన రకమైన పాత్రను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పాత్రల వల్ల వండే వంట రుచి ఆధారపడి ఉంటుంది. కలర్ పోయిన పాన్ లేదా లోహ పాత్రలను ఎంచుకోవడం మానుకోవాలి. బదులుగా సిలికాన్, నైలాన్ లేదా చెక్క పాత్రలు ఎంచుకోవాలి. వీటిలో వండితే రుచి చెక్కుచెదరకుండా ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఐస్ క్రీమ్ తింటే నిజంగానే శరీరం చల్లబడుతుందా?


Join Us on Telegram:https://t.me/abpdesamofficial