ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే శాఖలో కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌-2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారి నుంచి నవంబరు 10 నుంచి నవంబరు 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 


రద్దుకు కారణామిదే..
కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి సాంకేతిక విద్యార్హతను అదనంగా చేర్చాలని నిర్ణయించినందున ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అంతేకాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేస్తున్నారు. వీటి వివరాలను నోటిఫికేషన్‌లో ఇవ్వాల్సి ఉన్నందున నోటిఫికేషన్‌ను రద్దుచేశారు.



పోస్టుల వివరాలు..


* కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్


పోస్టుల సంఖ్య: 08 


జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు: గుంటూరు-01, నెల్లూరు-01, కడప-01, చిత్తూరు-03, అనంతపురం-01, కర్నూలు-01.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ సంస్థ నుంచి డ్రాట్స్‌మ్యాన్( సివిల్) విభాగంలో రెండేళ్ల కోర్సుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అందులో సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.


వయోపరిమితి: 01/07/2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్ల రేషన్ కార్డు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 


జీతం: రూ.34,580 -1,07,210.


Notification


ALSO READ:


తెలంగాణలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..