Horoscope Today July 29, 2023


మేష రాశి 
ఈ రాశివారికి శనివారం పెద్దగా కలసిరాదు. మీ అభిప్రాయాలను అంగీకరించమని ఎవరినీ బలవంతం చేయవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. సన్నిహిత వ్యక్తుల గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు నూతన ఆలోచనలు చేయవద్దు. 


వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆనందంగా ఉంటారు. వ్యాపారులు నూతన ప్రణాళికలు వేసుకోవచ్చు. నూతన పెట్టుబడుల గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచిసమయం. ఎవరిపట్లా ద్వేషం పెంచుకోవద్దు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అధికారులు మీపనివిషయంలో సంతృప్తిగా ఉంటారు.


మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారికి పనిపై దృష్టి మళ్లదు. కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం , ప్రవర్తన కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు మీ ఆదాయంపై ప్రభావం చూపుతాయి. మనసులో ఏవేవో ఆలోచనలు వెంటాడుతాయి. 


Also Read: కుక్క ఏడిస్తే అపశకునమా , ఎవరికో మూడినట్టేనా -ఇందులో నిజమెంత!


కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా కాస్త తేలికపడతారు. పిల్లలతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. 


సింహ రాశి
ఈ రాశివారికి స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ లోపాలను గుర్తించి వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నించండి.  చిన్న పిల్లలు ఇంట్లో సందడి చేయవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది


కన్యా రాశి 
సన్నిహత సంబంధాలతో చేదు వాతావరణానికి చెక్ పెట్టే ప్రయత్నం చేయండి. కుటుంబ సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయని గుర్తించండి. విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్నవారికి సమస్యలు తలెత్తుతాయి.ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.  


తులా రాశి
ఈ రాశివారి వ్యక్తిగత ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ప్రయాణంలో ఎదురవుతాయి. ఏవైనా పత్రాలపై సంతకాలు చేసేముందు వాటిని పూర్తిగా చదవడం మంచిది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఏకాంతంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు.


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


వృశ్చిక రాశి 
ఈ రాశివారు సమాజంలో ఉన్నత స్థానం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధాలు మధురంగా ​​ఉంటాయి. మేధోపరమైన పనులలో విజయం ఉంటుంది. బంధువులను కలుస్తారు. 


ధనుస్సు రాశి
ఈ రాశివారు మధ్యవర్తిత్వ వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆంటకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఏదో ఆందోళన ఉంటుంది. న్యాయపరమైన విషాల్లో ఇరుకున పడతారు. 


మకర రాశి
ఈ రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు తమ తల్లిదండ్రుల ఆదేశాలను పాటించాలి. మీ ఆలోచనల్లో కొత్తదనం ఉంటుంది. మీ అభిప్రాయాలు అద్భుతంగా ఉంటాయి కానీ మీ మాటలతో ఎవ్వరూ ఏకీభవించరు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో అస్సలు పెట్టుబడులు పెట్టొద్దు. పాత స్నేహితులను కలుస్తారు.


కుంభ రాశి
వ్యాపారం బాగానే సాగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు కానీ మనసులో ఏ మూలో చిన్న ఆందోళన వెంటాడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. కంటినిండా నిద్రపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 


మీన రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం ఈరోజు బావుంటుంది. వ్యాపారులు నూతన ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు సహోద్యోగులతో సంతోషంగా ఉంటారు. ధార్మిక ప్రదేశాలకు ఈరోజు అనుకూలమైనరోజు. విద్యార్థులు చదువుకి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకునేందుకు మంచిరోజు.