Weightloss Tips : బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా భోజనం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు బరువు తగ్గేందుకు భోజనం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బరువు పెరుగుతూనే ఉంటారు. దానికి భోజనం రీజన్ కాదట. ఆ సమయంలో తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బరువుపెరుగుతారట. ఇలా చేయడం వల్ల హెల్తీ ఫుడ్ తీసుకున్నా.. వ్యాయామం చేస్తున్నా సరే బరువు పెరుగుతారని చెప్తున్నారు. ఇంతకీ భోజన సమయంలో చేయకూడని పనులు ఏంటి?
భోజన సమయంలో జంక్ ఫుడ్స్ లిమిట్‌గా తీసుకున్నా పర్లేదు కానీ.. తెలియకుండా చేసే కొన్ని పనులు వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. దీనివల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతుందని చెప్తున్నారు. ఇంతకీ మధ్యాహ్న భోజనం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ అలవాట్లు వల్ల బరువు పెరుగుతారో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ప్లేట్లో అవి కచ్చితంగా ఉండాలి..
బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మీరు ఏమి తింటున్నారనే దానిపై కచ్చింతగా ఫోకస్ పెట్టాలి. మీ లంచ్ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. అంటే మీ ప్లేట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి. కానీ కొందరు కార్బ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైబర్, ప్రోటీన్ కూడా లంచ్‌లో ఉండదు. ఆ సమయంలో మీరు తక్కువగా తిన్నా కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకుంటే లంచ్‌లో ఇవి కూడా ఉండేలా చూసుకోవాలి. కార్బ్స్ మాత్రమే తీసుకుంటే.. ఆకలి ఎక్కువగా వేసి బరువు ఎక్కువగా పెరిగే అవకాశముంది.
బయటి ఫుడ్ వద్దు..
చాలామంది మధ్యాహ్న భోజనానికి బయట అలవాటు పడుతున్నారు. బయట ఫుడ్‌లో న్యూట్రెంట్స్ ఉండవు. పైగా ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. రుచికోసం వివిధ రకాల కెమికల్స్ వేస్తారు. షుగర్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి బరువు పెరిగేలా చేస్తుంది. కుదిరితే ఇంటి ఫుడ్ తినాలి. లేదంటే.. ఫ్రూట్స్, కూరగాయలను హెల్తీ ఆప్షన్‌గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
భోజనం మానేస్తారు..
బరువు పెరిగిపోతున్నాము.. తగ్గాలి అనే ఉద్దేశంతో చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే భోజనం మానేయడం. అయితే భోజనం మానేసే బదులు.. న్యూట్రిషనల్ ఫుడ్‌ని శరీరానికి అందిస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. లేదు బరువు తగ్గాలని ఫుడ్ మానేస్తే మాత్రం బరువును తగ్గించడం కాదు కదా.. మిమ్మల్ని వీక్ చేసి.. మరింత బరువు పెరిగేలా చేస్తుంది. పైగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏది మానేసినా.. దానివల్ల మెటబాలీజం తగ్గిపోతుందట. మెటబాలీజం తగ్గితే.. బరువు పెరుగుతూనే ఉంటారు.
వాటి వినియోగం వద్దు..
సలాడ్స్, ఇతర బేకరి ఫుడ్ ఐటమ్స్‌ని లంచ్‌గా తీసుకునేప్పుడు డిప్స్, సాస్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారు. నిజం చెప్పాలంటే.. వీటివల్లే కేలరీలు ఎక్కువైపోతాయట. డిప్స్లే కదా.. సాసే కదా అనుకుంటే.. దానిని తక్కువగా తీసుకున్న కేలరీలు ఎక్కువ ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి క్రీమ్స్, డ్రెస్సింగ్స్కోసం ఉపయోగించే డిప్స్ ఉపయోగించకపోవడమే మంచిది.
అప్పుడు తినండి..
కొందరు ఆకలేస్తున్నా సరే బరువు తగ్గాలని తినడం మానేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. మీరు తగ్గాలనుకున్నప్పుడు ఆకలి వేస్తున్న సమయంలో కాస్త ఫుడ్ తీసుకుంటే మంచిది. లంచ్ టైమ్ అయినా.. కాకున్నా ఆకలి వేస్తున్నప్పుడు ఫుడ్‌ని లిమిటెడ్‌గా, అన్ని న్యూట్రిషన్స్ ఉండేలా చూసుకుని తినాలి.
చూసేందుకు ఇవి సింపుల్‌గా ఉన్నా.. ఈ మిస్టేక్స్ రెగ్యూలర్‌గా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరు నిజంగా బరువు తగ్గాలనుకుంటే వైద్యులు, నిపుణుల సలహా తీసుకుని.. వారి సూచనలకు అనుగుణంగా డైట్ ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.
Also Read : లివర్ని డీటాక్స్ చేసే ఫుడ్స్ ఇవే.. రెగ్యూలర్‌గా తీసుకుంటే మీ కాలేయం సేఫ్