Thug Life Release Date Teaser: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘థగ్ లైఫ్’. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, త్రిష, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌, జయం రవి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


కమల్ బర్త్ డే సందర్భంగా ‘థగ్ లైఫ్’ రిలీజ్ డేట్ అనౌన్స్


ఇవాళ కమల్ హాసన్ బర్త్ డే కావడంతో ‘థగ్ లైఫ్’ మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా థియేట్రికల్‌ టీజర్‌ తో పాటు రిలీజ్ డేట్ విడుదల చేశారు. సుమారు 44 సెకెన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కమల్ మల్టీఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ప్రధానంగా రంగరాయ శక్తివేల్ నాయకర్(కమల్ హాసన్)అనే గ్యాంగ్‍స్టర్ క్యారెక్టర్ చుట్టూ ఈ సినిమా తిరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కమల్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ‘థగ్‌ లైఫ్’ నుంచి మేకర్స్‌ ‘సిగ్మా థగ్ రూల్’ అంటూ శింబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఇక ‘థగ్ లైఫ్’ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను కమల్ హాసన్‌, ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. రాజ్‌ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌, మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌, ఆర్ మహేంద్రన్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‍లో 1987లో ‘నాయకన్’ అనే సినిమా వచ్చింది.  అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. 35 ఏండ్ల తర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది.  






 డిజాస్టర్ గా నిలిచిన ‘భారతీయుడు 2’


ఇక కమల్ హాసన్ చివరగా ‘భారతీయుడు 2’ సినిమాలో కనిపించారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమాలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. 


Read Also: ‘క’ ఓటీటీ రిలీజ్... అసలు విషయం చెప్పేసిన మేకర్స్, పుకార్లకు చెక్