Foods for a Healthy Liver Detox : శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. హెల్తీగా ఉంచడంలో లివర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే బరువు తగ్గడంలో అతి ముఖ్యపాత్ర పోషించే మెటబాలీజం కూడా లివర్​పైనే ఆధారపడి పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు, విటిమిన్లను స్టోర్ చేసి.. అవసరమైన సమయంలో అందించేది కూడా లివర్​నే. ఇవే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లివర్​ వల్లనే జరుగుతూ ఉంటాయి. అలాంటి లివర్​కే సమస్యలు వస్తే మొత్తం ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే లివర్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. 


కాలేయం అనేది శరీరం భాగాల్లో అతి ముఖ్యమైన భాగంగా చెప్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి.. టాక్సిన్లు చెడు కొవ్వుగా పేరుకుపోకుండా ఆరోగ్యాన్ని కాపాడే ఆర్గాన్. దీనివల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అయితే వివిధ కారణాల వల్ల లివర్​ సమస్యలు వస్తూ ఉంటాయి. లివర్ సరిగ్గా పనిచేయకుంటే శరీరంలో చెడుకొవ్వు కూడా పేరుకుపోతుంది. అందుకే కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకోవాలంటున్నారు. దీనివల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు పోయి.. లివర్ హెల్తీగా ఉంటుందని చెప్తున్నారు. ఇంతకీ లివర్​ని డీటాక్స్ చేసే ఫుడ్స్ ఏంటో.. వాటివల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


పసుపు


పసుపులో కర్క్యుమిన్ ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లివర్​ని డీటాక్స్ చేస్తాయి. కాలేయం డ్యామేజ్​ కాకుండా కాపాడి.. దాని పని తీరును మెరుగుపరుస్తాయి. 


వెల్లుల్లి


వెలుల్లిలో సల్ఫర్ కంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్​ ఎంజైమ్స్​ని ప్రభావితం చేసి.. టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. ఎల్లిసిన్, సెలెనియం వంటి న్యూట్రిషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్​ హెల్త్​ని డ్యామేజ్ కాకుండా డీటాక్స్ చేస్తాయి. 


బీట్ రూట్


బీట్​రూట్ కూడా లివర్​ హెల్త్​కి మంచిది. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. లివర్​ని డీటాక్స్ చేస్తాయి. రెగ్యూలర్​గా బీట్​రూట్ జ్యూస్ తాగితే.. లివర్ హెల్త్ మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు కూడా తేల్చాయి. 


గ్రీన్ టీ.. 


గ్రీన్​ టీ పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. రెగ్యూలర్​గా దీనిని తీసుకుంటే లివర్ ఎంజైమ్ లెవల్స్ పెరిగి.. ఆరోగ్యంగా ఉంటారు. 


కూరగాయలు


ఆకు కూరలు, కూరగాయల్లో క్లోరోఫిల్ పుష్కలంగా ఉటంుంది. ఇవి లివర్​ని డీటాక్స్ చేసి.. హెల్తీగా ఉంచుతాయి. అయితే సహజంగా పండించే వాటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది. లేదంటే కెమికల్స్, పెస్టిసైడ్స్ వెళ్లి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారవచ్చు. 


ఆలివ్ ఆయిల్


ఆలివ్​ ఆయిల్​తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది లివర్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. శరీరాన్ని, లివర్​ని డీటాక్స్ చేసి.. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. 


వాల్​నట్స్ 


వాల్​నట్స్​లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎమీనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయాన్ని డీటాక్స్ చేస్తాయి. లివర్​ను శుభ్రం చేసి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా లివర్​ని కాపాడుతాయి. ఇవి గుండెకు కూడా మంచివి. 



ఇవే కాకుండా సిట్రస్ ఫ్రూట్స్, యాపిల్స్, తాజా కూరగాయలు కూడా లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా డీటాక్స్ చేసి.. కాలేయ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు కాబట్టి.. వీలైనంత తొందరగా కాలేయాన్ని కాపాడుకునే చర్యలు తీసుకోవాలి. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 



Also Read : రాత్రుళ్లు ఆలస్యంగా పడుకొని.. ఉదయం త్వరగా నిద్రలేస్తున్నారా? అయితే జాగ్రత్త