అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు వాడే మాత్రలు గర్భి నిరోధక ట్యాబ్లెట్స్. వీటిని వాడడం చాలా సులువు కాబట్టే వినియోగం కూడా అధికమైపోయింది. వీటిలో అండాశయాలు అండాలను విడుదల చేయకుండా అడ్డుకునే హార్మోన్లు ఉంటాయి. ఇవి కలయిక జరిగాక అండాలు, వీర్య కణాల మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. ఒక్క మాత్రతో పని జరిగిపోదు, అధికంగా వాడాల్సి వచ్చేది. ఈ మాత్రలు కేవలం గర్భాన్ని నిరోధించడానికే కాదు, మొటిమలను తగ్గించడం, పీరియడ్స్ క్రమపద్ధతిలో వచ్చేలా చేయడం, హెవీ పీరియడ్స్ ను అడ్డుకోవడం, ఎండో మెట్రియోసిస్, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కానీ ఈ మాత్రల వల్ల కొన్ని చెడు ప్రభావాలు శరీరంపై చూపూ అవకాశం కూడా ఉంది. ఎలాంటి దుష్ర్పభావాలు పడతాయో ఒకసారి తెలుసుకుందాం. 


వికారం
గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో మొదట్లో వికారంగా అనిపిస్తాయి. మనిషిని స్థిమితంగా ఉండనీయవు. అలాంటప్పుడు నిద్రవేళలో లేదా భోజనం తరువాత మాత్ర వేసుకుంటే మంచిది. వికారం నెలల పాటూ కొనసాగుతుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. 


బరువు పెరగడం
గర్భనిరోధక మాత్రలు బరువు పెరిగేందుకు సహకరిస్తాయి. ఇది శరీరంలో నీటిని పట్టి ఉంచుతాయి. దీని వల్ల త్వరగా ఒళ్లు వచ్చేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడా పెంచుతుంది. కండరాలు కూడా బరువు పెరుగుతాయి.అయితే గర్భినిరోధక మాత్రల వల్ల ఎందుకు బరువు పెరుగుతామో మాత్రం నిర్ధారించే పరిశోధనలు ఎక్కడ జరగలేదు. 


పీరియడ్స్ క్రమం తప్పడం
జీవితంలో తీవ్ర ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార, చెడు జీవనశైలి కారనంగా పీరియడ్స్ క్రమం తప్పుతాయి. కానీ కొన్నిసార్లు గర్భినిరోధక మాత్రల వల్ల కూడా పీరియడ్స్ క్రమం తప్పుతాయి. ఒక నెల వచ్చి, మరో నెల మిస్సవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. 


మూడ్ స్వింగ్స్
గర్భనిరోధక మాత్రలలో మానసిక పరిస్థితిని ప్రభావితం చేసే హార్మోన్లు ఉంటాయి. డెన్మార్క్‌లో 2016లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తేలింది. కాబట్టి ఈ ట్యాబ్లెట్లు వాడే వారికి కోపం, చిరాకు త్వరగా వచ్చేస్తాయి. మనసులో గందరగోళంగా అనిపించవచ్చు. 


వీటి వల్ల ఇతర చెడు ప్రభావాలు


1. రొమ్ములు సున్నితంగా మారుతాయి. ముట్టుకుంటే నొప్పి కూడా రావచ్చు. 
2. కంటి చూపులో మార్పు కనిపించవచ్చు.
3. మైగ్రేన్ వంటి తలనొప్పులు రావచ్చు
4. యోని నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు. 


Also read: ఎవరికీ ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే’ అని విషెస్ చెప్పకూడదు, ఎందుకో తెలుసా?




Also read: అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు