2022 ఏప్రిల్ 15 శుక్రవారం రాశిఫలాలు


మేషం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం సరికాదు.తొందరపాటు,భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. కోర్టు కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి.


వృషభం
మీరు ఈరోజు ఏదైనా విషయంలో కోపంగా ఉండొచ్చు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. గృహంలో శుభకార్యాలు జరగొచ్చు.ప్రేమికులకు బావుంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మీపై గొప్ప ప్రభావం చూపుతాయి. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. దినచర్య సాధారణంగా ఉంటుంది.


మిథునం
అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి. వైవాహిక సంబంధాల్లో అహంకారం ప్రదర్శించవద్దు. వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండండి.


కర్కాటకం
చాలా రోజులుగా చేతికందాల్సిన మొత్తం అందుతుంది. ప్రయాణ ప్రణాళికలు వేసుకోవచ్చు. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ ధనలాభం ఉంటుంది.దగ్గరి బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.


Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమేసింహం
ప్రభుత్వ పనులు పూర్తి చేయగలుగుతారు.టెన్షన్ తగ్గుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేయాలనుకున్నవారికి ఇదే మంచి సమయం. కళాక్షేత్రానికి సంబంధించిన వ్యక్తులు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు కొత్త వేదిక దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా తీవ్రమైన విషయాన్ని చర్చించవచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి. అధిక కారం తినొద్దు.


కన్యా
వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులను కలవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. విందులో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా బహిరంగ సభకు హాజరుకావచ్చు. వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన  నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక శ్రమ వల్ల అలసట ఉంటుంది.


తుల 
మీ బాధ్యతను మరొకరిపై మోపకండి.స్నేహితుడిని కలుస్తారు. ఏ పనీ పూర్తి కానందున మీరు ఇబ్బంది పడతారు. ప్రతికూల వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. ఈ రోజు మీ మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. మీరు వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందవచ్చు.


వృశ్చికం
మీరు ఈరోజంతా చాలా బిజీగా ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలొస్తాయి.అసమతుల్యతకు దూరంగా ఉండండి. 


ధనుస్సు 
మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకుంటుంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాన్ని సమర్థవంతంగా చేయండి. కార్యాలయంలోని అంతర్గత అమరికలో కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు. రోజు సరిగ్గా ప్రారంభం కాదు.ఏదైనా పాత ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదుమకరం
శ్రమకు తగిన ఫలితం లభించదు. సమస్య ఉండొచ్చు. ఇంట్లో విందు కార్యక్రమం జరుగుతుంది.కుటుంబంలో గొడవ జరిగే అవకాశం ఉంది. కాస్త సంయమనం పాటించండి. ఈరోజులో కొంత సమయం మీకోసం కేటాయించాలని నిర్థారించుకోండి. మతపరమైన యాత్రకు వెళ్ళొచ్చు.


కుంభం
జీవిత భాగస్వామి మాటల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అహం తగ్గించుకోండి. కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవద్దు. ఈరోజు మీరు రుణం తీసుకోకూడదు. వ్యాపారంలో ప్రత్యర్థుల వల్ల నష్టాలు రావొచ్చు. మీ పనిని ఇతరులకు అప్పగించకండి.


మీనం
ఈ రోజంతా సానుకూలంగా ఉంటుంది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ సమాచారం పొందుతారు.నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వ పనులు సులువుగా జరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


Also Read: ఈ వారం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంది, మీరున్నారా ఇందులో తెలుసుకోండి