చపాతీలు తింటే బరువు పెరగము అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే ఉదయం పూట అన్నం తిన్నా కూడా రాత్రి పూట మాత్రం చపాతీలు తింటుంటారు. బరువు తగ్గడానికి అది ఉత్తమమైన ఎంపికగా భావిస్తారు. అయితే చపాతీలు చేసేటప్పుడు ఆ పిండిలో ఒక సీక్రెట్ పదార్థం కూడా కలిపి చేస్తే మీరు శక్తిమంతంగా తయారవ్వడమే కాదు, త్వరగా బరువు కూా తగ్గుతారు. ఆ సీక్రెట్ పదార్థమేంటో తెలుసా? సత్తు పొడి.
ఏంటిది? ఎక్కడ దొరుకుతుంది?
సత్తు పౌడర్ అని టైప్ చేస్తే అన్ని ఈ కామర్స్ సైట్లలో కూడా లభిస్తుంది. దీన్ని కొని చపాతీ పిండిలో కలిపి పరాటాలు, చపాతీలు, రోటీలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సత్తు పొడి అనగానే అదేదో వింత పదార్థం అనుకోకండి. శెనగపప్పు, బార్లీ గింజలతో ఈ సత్తు పొడిని తయారు చేస్తారు. మరికొందరు బాదం,జీడిపప్పు, బార్లీ, కొమ్ము శెనగలను వేయించి పొడిచేస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో అధికంగా వాడతారు. ఇప్పుడు మనకి కూడా ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటోంది సత్తు పొడి. అమెజాన్ లో అందుబాటులో ఉంది.
సత్తు పొడిలో ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, సోడియం, ఇనుము అధికంగా ఉంటాయి. దీన్ని గోధుమపిండిలో కలుపుకుని పరాటాలు, చపాతీలు చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
ఇలా చేయండి...
రెండు కప్పుల గోధుమ పిండికి, ఒక కప్పు సత్తు పిండిని యాడ్ చేయాలి. పిండిని బాగా కలిపి స్మూత్ గా వచ్చేలా చేసుకోవాలి. వాటితో పరాటాలు, రోటీలు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని ఏ కూరతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది కచ్చితంగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం పొట్టనిండిన భావనతో ఉంచి, ఇంకేమీ తినకుండా చూస్తుంది. దీని వల్ల మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు.
Also read: మంకీపాక్స్ - స్మాల్ పాక్స్ మధ్య తేడాను కనిపెట్టడం ఎలా? నిపుణులు ఏమంటున్నారు?
Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకో అరటి పండు లాగించేయండి
Also read: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? పచ్చిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.